ఏపీ రాజకీయం రంజుగా మారుతోంది. ఏపీలో ప్రధాన విపక్షాలు అన్నీ ఒకే గూటికి చేరే పరిస్థితి ఏర్పడుతోంది. నిన్నటిదాకా జనసేన టీడీపీల మధ్యనే పొత్తు ఉండే అవకాశం కనిపిస్తున్న సీన్ కాస్తా ఇపుడు బీజేపీ ఎంట్రీతో 2014 రాజకీయం తెర పైకి వస్తోంది.
ఇక ఏపీలో ఈ కూటమితో పొత్తు లేకపోయినా వామపక్షాలు కాంగ్రెస్ కూడా వైసీపీని వ్యతిరేకిస్తాయి. ఏపీ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీయారెస్ కూడా వైసీపీనే టార్గెట్ చేస్తుంది. అంటే ఏపీలో వైసీపీ అనుకూల వ్యతిరేక ఓట్లు మాత్రమే రేపటి ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషిస్తాయని అంటున్నారు.
ఇక అధికార వైసీపీ అయితే విపక్షాలు కేవలం జగన్ని గద్దె దించాలన్న ఒకే ఒక అజెండాతో తప్ప మరే విషయంలోనూ కలసి లేవని భావిస్తోంది. సీఎం అవుతాను అని పవన్ ఒక వైపు అంటూంటే ఏపీ నుంచి ఇరవై ఎంపీ సీట్లు అని ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పుకొచారని గుర్తు చేస్తోంది.
ఇంకో వైపు చూస్తే తెలుగుదేశం పార్టీకి బీజేపీ జనసేనలను తన డైరెక్షన్ లో తీసుకుపోవడం రిస్కీ టాస్క్ గానే ఉంటుందని అంటున్నారు. ఇక ఓటరు కి 2024 ఎన్నికలు చూస్తే పక్కా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ మీద అభిమానం ఉంటే జగన్ ఇచ్చే స్కీముల మీద గురి ఉంటే కచ్చితంగా ఆ ఓట్లు ఫ్యాన్ పార్టీకే పడతాయి. వాటిని ఎవరూ వేరు చేయలేరు.
అదే విధంగా చూస్తే జగన్ కి వేయాలనుకున్న ప్రతీ ఓటూ ఫ్యాన్ వైపే వస్తుంది. దాన్ని ఏవరూ టచ్ చేయలేరనే అంటున్నారు. అదే విపక్షం వైపు తీసుకుంటే జగన్ వ్యతిరేక ఓటు మొత్తం గంపగుత్తగా కూటమికే పడుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు సీఎం కావాలనుకునే వారు ఉంటారు. అలాగే పవన్ సీఎం అని ఒక సామాజికవర్గం ఆకాంక్షలు ఉన్నాయి.
బీజేపీ మీద యాంటీగా మరో సెక్షన్ ఉంది. దాంతో ఈ కూటమిని ఏకోన్ముఖంగా జగన్ వ్యతిరేక దిశగా తీసుకుపోవడానికి ఎంత వరకూ అవకాశాలు ఉన్నాయన్నది కూడా చర్చగా ఉంది. ఇక వైసీపీ వ్యతిరేక ఓటు అనే పవన్ అయినా మరో నేత అయినా ఇప్పటిదాకా విపక్షం నుంచి చెబుతూ వస్తున్నారు.
అదే టైం లో వైసీపీ కూడా వ్యతిరేక ఓట్లు కూటమి వైపు వెళ్తాయా లేక చీలుతాయా అన్న దాని మీద దృష్టి పెట్టడంలేదు. దాని కంటే ముందు తమకు ఉన్న పాజిటివ్ ఓటుని పెంచుకోవాలని చూస్తోంది. అందుకే జగన్ ప్రతీ సభల్లో తాను చేసిన మంచి పనులు ప్రతీ ఇంట్లో ఉన్నాయని తాను మంచి చేశాను అని నమ్మితే తనకు మీరే ఒక సైన్యంగా అండగా నిలవాలని కోరారు.
దాంతో వైసీపీ అనుకూల ఓటు ఎంత పెరిగితే అంత తమకు అడ్వాంటేజ్ గా ఉంటుందన్నదే జగన్ మార్క్ వ్యూహంగా కనిపిస్తుంది. యాంటీ ఓటును చీలకుండా విపక్షం ఒక్కటి చేయవచ్చేమో కానీ అనుకూల ఓటుని మాత్రం ఏమీ చేయలేదన్నేఅ వైసీపీ స్ట్రాటజీగా కనిపిస్తోంది.
ఇదే తరహా వ్యూహాన్ని యూపీ ఎన్నికల్లో బీజేపీ ప్రయోగించి రెండవసారి గెలిచిందని వైసీపీ నేతలు అంటున్నారు. అక్కడ విపక్షాలు అన్నీ ఒక వైపున చేరి యోగీ కి ఎదురు నిలిచాయి. అయితే జనాలకు యోగీ కావాలో వద్దో అన్నది తేల్చుకునే సమయం వచ్చినపుడు ప్రభుత్వానికే అండగా నిలబడ్డారు.
ఇపుడు కూడా ఏపీలో అలాంటి ఆప్షన్ జనాలకు వచ్చేలా ఉందని, ఒక విధంగా విపక్షాలే ఆ సీన్ ని క్రియేట్ చేస్తున్నాయి కాబట్టి దాన్ని మరింతగా పదును పెట్టి అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ చూస్తోంది. దాంతో యాంటీ వైసీపీ ఓటు ఎంత ఉందో ఎన్నికల తరువాత తెలుస్తుంది. అనుకూల ఓటుని మాత్రం ముందే దగ్గర చేసుకుంటే మరోసారి విజయం ఖాయమని వైసీపీ భావిస్తోంది.
అంతే కాదు ఏపీలో విపక్షాలే జగన్ పేరుని ఎక్కువగా వాడి పాపులర్ చేస్తాయని అలా అరుదైన ఎన్నికగా ఇది ఉంటుందని అంటున్నారు. అందరూ జగన్ పేరుతోనే రాజకీయాలు చేస్తారు కాబట్టి అది వ్యతిరేకమైనా కూడా మరో వైపు నుంచి అనుకూలంగా కూడా మారుతుంది అన్నదే వైసీపీ వ్యూహమని అంటున్నారు.
జగన్ని పొగిడినా తిట్టినా రేపటి ఎన్నికల్లో ఆయన పేరు ఫుల్ గా మారుమోగడం ఖాయం. కేంద్ర బీజేపీ నుంచి ఏపీలోని చిన్న పార్టీల వరకూ అంతా చేసే విపరీతమైన ఈ ప్రాపగాండా జగన్ కి ప్లస్ అవుతుందని అంటున్నారు. దేశంలో యాంటీ మోడీ పాలిటిక్స్ ని నడిపి 2019లో విపక్షం చతికిలపడిన తీరుని కూడా వారు ఉదహరిస్తున్నారు. మొత్తంగా చూస్తే జగన్ వర్సెస్ విపక్షం తమకే మేలు అన్నదే ఫ్యాన్ పార్టీ అంచనాగా ఉందిట.