ఏపీ అధికారపక్ష నేతలకు ఒక దుర్వార్త. నిన్న మొన్నటివరకు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరికి దిమ్మ తిరిగిపోయేలా షాకింగ్ న్యూస్ ఒకటి సిద్ధం చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మొన్నటివరకు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీ నేతలు దూకుడుగా వ్యవహరించినా పట్టించుకోకపోవటం తెలిసిందే. అధికారం ఏ మాత్రం తలకెక్కకూడదన్న విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తుంటారు. అయినప్పటికీ పార్టీ నేతలకు ఇవేమీ పట్టవు.
ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితం టోల్ ప్లాజా వద్ద వడ్డెర రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న రేవతి దూకుడుగా వ్యవహరించటం.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలోనూ.. మీడియాలో తెగ వైరల్ కావటం తెలిసిందే. దీంతో.. ఈ వ్యవహారం సీఎం వరకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. తనను కలవాల్సిందిగా రేవతిని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేయటం.. ఈ సందర్భంగా ఆమెకు భారీ తలంటు పడుతుందన్న అంచనా వేస్తున్నారు.
ఇటీవల కాలంలో ప్రభుత్వం బద్నాం అయ్యే ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. అదే సమయంలో బలమైన ప్రత్యర్థి బరిలో ఉన్నప్పుడు పాలన అంత తేలికనైన విషయం కాదు. రేవతి ఎపిసోడ్ లో జరిగింది కూడా ఇదే. విపక్షాలన్ని కలిసి.. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న పరిస్థితి. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. దీంతో.. ప్రభుత్వానికి జరుగుతున్న డ్యామేజ్ ను గుర్తించిన సీఎం జగన్.. గీత దాటిన నేతలపై కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరికల్ని పంపినట్లుగా చెబుతున్నారు.
చేతికి అధికారం దక్కిన ఏపీ అధికార పక్ష నేతలంతా .. తమకు లభించిన అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ అన్నట్లుగా తమ పరపతిని ప్రదర్శించటానికి అస్సలు వెనుకాడటం లేదు. వాస్తవానికి ఈ తీరు పార్టీకి.. ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారింది. అదే సమయంలో రేవతి ఎపిసోడ్ చోటుచేసుకోవటంతో.. తాజాగా పార్టీ నేతలకు క్లియర్ సమాచారాన్ని పంపారు సీఎం జగన్. తోక జాడిస్తే.. వేటు ఖాయమని స్పష్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ వార్నింగ్ ఏ మేరకు వర్కువుట్ అవుతుందో చూడాలి.