ముందు ప్రత్యర్థుల మీద దాడులు.. వారి పని పట్టిన తర్వాత సొంత పార్టీలో వర్గపోరు.. ఏపీ అధికార వైసీపీలో ప్రస్తుతం సీన్ ఇలానే ఉంది. అధినేత ఆదేశాలు.. ఆయన విజన్ కంటే కూడా తమ సొంత ఎజెండాకే ప్రాధాన్యం ఇచ్చేలా కొందరి వైసీపీ నేతలు తీరు ఉందని చెప్పాలి.
తిరుగులేని అధికార పార్టీగా చెప్పుకుంటున్న వైసీపీకి సొంత పార్టీలోని వర్గ పోరు ఇప్పుడు షాక్ కు గురి చేసేలా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కుప్పం సీటును వచ్చే ఎన్నికల్లో సొంతం చేసుకోవాలన్న సీఎం జగన్ ఆలోచనకు భిన్నంగా.. అక్కడి వైసీపీ నేతల మధ్య నెలకొన్న వర్గ పోరు.. ఇప్పుడు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లటం గమనార్హం.
రాజకీయ ప్రత్యర్థుల్ని కట్టడి చేసే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి కొంతమేర విజయం సాధించినట్లుగా చెబుతారు. మరి.. సొంతోళ్లను ఆయన ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏపీలోని 175 స్థానాల్లో కుప్పం ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే నియోజకవర్గంగా చెప్పక తప్పదు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కంచుకోటలా ఉండే కుప్పం మీద వైసీపీ జెండా ఎగురవేయాలని ఆయన తపిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఎజెండా పెట్టుకొని మరీ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నారు.
ఇలాంటి వేళ.. ఆధిపత్య పోరులో ఆయన కల ఛిద్రం కావటం ఖాయమన్నట్లుగా పరిస్థితి ఉంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేష్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయటం.. ఆయన పరిస్థితి విషమంగా ఉండటం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ తరహా దాడి చేసే సత్తా ప్రతిపక్షానికి లేదని.. సొంత పార్టీకి చెందిన తమ ప్రత్యర్థులు చేసిన పనిగా భరత్ వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.
జరిగిన దాడి నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. దాడికి కారణం అధికార పార్టీకి చెందిన మరో వర్గమన్న విషయాన్ని గుర్తించటంతో తొందరపడలేని పరిస్థితి నెలకొని ఉన్నట్లుగా చెబుతున్నారు. దాడికి సంబంధించిన సమాచారాన్ని.. దానికి బాధ్యులైన వారిని అధినేతకు సమాచారం అందించినట్లుగా చెబుతున్నారు.
అధినేత కలను ఛిద్రం చేసేలా మారిన వర్గ పోరు విషయంలో సీఎం జగన్ ఎలాంటి చర్యలు చేపడతారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సొంతోళ్లను కంట్రోల్ చేసే విషయంలో ముఖ్యమంత్రి వైఖరి ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.