ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనపై విశాఖపట్నంలోని పోర్టు కళావాణి స్టేడియంలో వైసీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన 'విద్యార్థి యువభేరి' సదస్సులో తోపులాట చోటుచేసుకుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు రావడంతో తోపులాట జరిగింది. దీంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో అక్కడున్న పార్టీ నేతలు, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.
ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలనే తలంపుతో యువకులను సమాయత్తం చేసేందుకు వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను కదిలిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో 'నవ్యాంధ్ర ప్రదేశ్ లో విద్య, ఉపాధి అవకాశాలు - రాష్ర్ట భవిష్యత్తు' అనే అంశంపై యువభేరి పేరిట భారీ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో జగన్ పాల్గొని, ప్రత్యేక హోదా సాధనపై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతారు.
కాగా జగన్ కార్యక్రమంపై టీడీపీ వర్గాలు విమర్శలు కురిపిస్తున్నాయి. జగన్ యువభేరి పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్నాడని, ఆయన చేసేది యువభేరి కాదని... సీఎం కుర్చీ భేరి అని టీడీపీ నేత గాలి ముద్ధుకృష్ణమనాయుడు అంటున్నారు. జగన్ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.