సంక్షేమ పథకాలను సరికొత్తగా ప్రజలకు వద్దకు తీసుకెళ్లే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ రోజు (శుక్రవారం) నుంచి "జగనన్నే మా భవిష్యత్తు" పేరిట సరికొత్త పథకాన్నితెర మీదకు తీసుకొస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు వీలుగా జగనన్న సైన్యం రంగంలోకి దిగనున్నారు. ఏకకాలంలో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ సైన్యం రంగంలోకి దిగి ప్రజల కోసం జగన్ సర్కరు చేస్తున్న పనులను.. గత ప్రభుత్వంతో పోల్చి తామెంత దూకుడుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వైనాన్ని వివరిస్తారు. నాలుగేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో రూ.2 లక్షలకోట్ల మొత్తాన్ని లబ్థిదారుల ఖాతాలకు వేయటం జరిగింది.
ఈ నెల 20 వరకు సాగే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వీనర్లు.. ప్రతి 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున ఏర్పాటు చేసిన గృహ సారథులతో మొత్తం 7 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందుకోసం వీరికి ప్రత్యేకమైన కిట్ బ్యాగులను అందజేస్తారు. ఈ కార్యక్రమాన్ని కచ్ఛితంగా ప్రజల్లోకి వెళ్లేందుకు వీలుగా ఎమ్మెల్యేలు.. నియోజకవర్గ సమన్వయకర్తలు కోఆర్డినేట్ చేస్తారు.
పద్నాలుగు రోజుల పాటు సాగే ఈ ప్రోగ్రాం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాల్లోని 5కోట్ల మంది ప్రజల్ని కలవనున్నారు. వీరంతా ప్రజల వద్దకు వెళ్లి జగన్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించటంతో పాటు.. ఐదు ప్రశ్నలు సంధిస్తారు. ఆ ఐదు ప్రశ్నలేమంటే..
1. గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే జగనన్న పాలనలో మీకు.. మీ ఫ్యామిలీకి మంచి జరిగిందా?
2. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి.. ప్రతి సామాజిక వర్గానికి.. ప్రతి కుటుంబానికి గతం కంటే ఎక్కువగా జగనన్న పాలనలో మంచి జరిగిందా?
3. గత ప్రభుత్వం కంటే జగనన్న ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన పింఛన్.. అమ్మఒడి.. అసరా.. చేయూత లాంటి అనేక పథకాల ద్వారా డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో వేసిన తీరు.. వలంటీర్ల వ్యవస్థ ద్వారా మీ చేతికి అందించటం
బాగుందా?
4. జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరుకుంటున్నారా?
5. జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కొనసాగించేందుకు మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.