నీ సీఎం కుర్చీ కాంగ్రెస్ ఇచ్చిన భిక్ష కేసీఆర్?

Update: 2020-09-09 08:50 GMT

కాంగ్రెస్ ఏం చేసిందని అసెంబ్లీలో ప్రశ్నించిన సీఎం కేసీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కాంగ్రెస్ వల్లే కేసీఆర్ ఇంత ఎదిగారంటూ కౌంటర్ ఇచ్చారు. గన్ పార్క్ వద్ద జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ ను కాంగ్రెస్ కేంద్రమంత్రిని చేయడం వల్లే ఎదిగాడని.. సోనియా, రాహుల్ గాంధీలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం వల్లే కేసీఆర్ సీఎం అయ్యారని జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు.

కాంగ్రెస్ ఏమీ చేయలేదంటూ కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ తదితరులు మాట్లాడుతున్నారని.. పెట్టిన ఇంట్లనే కన్నం పెట్టి పాలు తాగి రోమ్ము కోసే చరిత్ర టీఆర్ఎస్ ది అని జగ్గారెడ్డి సంచలన విమర్శలు చేశారు.

పీవీని ప్రధానిని చేసింది ఆనాడు సోనియా అని.. ఇప్పుడు కేసీఆర్ ఆయనకు భారతరత్న ఇవ్వాలంటూ హైజాక్ చేస్తున్నాడని జగ్గారెడ్డి ఆరోపించారు. పీవీ కూడా కాంగ్రెస్ నేతనే అని కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణలో మీడియాను కేసీఆర్ సగం కొనేశాడని.. మిగిలిన సగాన్ని కూడా అసెంబ్లీ బయటకు వెళ్లగొట్టేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే నవ్వుల పాలవుతారని అన్నారు. మాయవతి, శరద్ పవార్ లకే ప్రధాని పదవి సాధ్యం కాలేదని అన్నారు. కేసీఆర్ వెంట ప్రాంతీయ పార్టీలు కలిసిరావని స్పష్టం చేశారు. మమత విలాసవంతమైన కేసీఆర్ కు మద్దతు ఇవ్వరని స్పష్టం చేశారు.
Tags:    

Similar News