టీఆర్ ఎస్ పై జగ్గారెడ్డి ఫైర్!

Update: 2019-07-07 05:11 GMT
మొన్నటి వరకూ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరతాడనే అనుమానాలను కలిగించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నట్టుండి కారు పార్టీపై విరుచుకుపడ్డారు. మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణలో రంగం సిద్ధం అవుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలపై ఆయన విమర్శలు చేశారు. సంగారెడ్డి ప్రాంతానికి టీఆర్ ఎస్ నేతలు తీవ్రమైన ద్రోహం చేశారని - వారిపై ఓటుతో ప్రతీకారం తీర్చుకోవాలని జగ్గారెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య నేత హరీష్ రావు - సంగారెడ్డి ప్రాంత టీఆర్ ఎస్  లీడర్ లపై జగ్గారెడ్డి విమర్శలను ఎక్కుపెట్టారు. తమ ప్రాంతం నుంచి  నీటిని దోచుకుని వెళ్లారని వారిపై విరుచుకుపడ్డారు. అలాంటి వారు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లను అడగడానికి రాబోతున్నారని.. వారికి తగిన బుద్ధి చెప్పాలని జగ్గారెడ్డి అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపును ఇచ్చారు.మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సమితిపై తీవ్రంగా విమర్శలు చేయడం ద్వారా జగ్గారెడ్డి ఆసక్తిని రేకెత్తించారు. ఆయన టీఆర్ ఎస్ లోకి చేరతారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ విమర్శలు ఆసక్తిదాయకంగా మారాయి.
Tags:    

Similar News