ఎవరూ మార్చలేని రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్సే. తమ మాటలతో పార్టీ పరువు బజారున పడుతుందన్న విషయం తెలిసినప్పటికీ.. మాట్లాడటం మానని నేతల్లో కాంగ్రెస్ పార్టీ వారు ఎక్కువ మంది ఉంటారు. మిగిలిన రాజకీయ పార్టీలకు చెందిన నేతల కడుపులో ఎన్ని సంచలనాలు ఉన్నా.. నోరు మూసుకొని ఉంటారే కానీ మాట్లాడటానికి సాహసించరు. ఒకరిద్దరు లైన్ దాటినా.. వారిని వెంటనే దారిలోకి తెచ్చేస్తుంటారు. కానీ.. కాంగ్రెస్ లో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించదు. ఇందుకు నిదర్శనంగా తాజాగా తెలంగాణ కాంగ్రెస్ లోని జగ్గారెడ్డి జగడం గా చెప్పాలి.
పార్టీ అన్నాక లోటుపాట్లు గ్యారెంటీ. అంత మాత్రానికే ఆగమాగం అవుతూ.. కీలక టార్గెట్ మరిచి.. తమలో తాము గొడవలు పడుతూ.. ప్రజల ముందు చులకన కావడం కాంగ్రెస్ నేతలకు ఒక అలవాటుగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరును తప్పు పడుతూ.. మాట్లాడిన జగ్గారెడ్డి.. తర్వాత కామ్ గా ఉండటం ఒక ఎత్తు. తాజాగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి రాసిన లేఖ ఒకటి మీడియాలో లీక్ కావటం ఇప్పుడు తాజా రచ్చగా మారింది.
ఇది క్రమశిక్షణ ఉల్లంఘనగా పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. క్రమశిక్షణను ఉల్లంఘించిన జగ్గారెడ్డిని క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలుస్తారన్న వార్తల నేపథ్యంలో స్పందించిన జగ్గారెడ్డి.. తనను కాదు ముందు రేవంత్ ను క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలవాలన్న వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారంగా మారాయి. జగ్గారెడ్డికి ఉన్న సమస్య.. రేవంత్ షురూ చేసిన రచ్చబండ కార్యక్రమంతోనే. కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ ఉన్న ఎర్రవెల్లికి వెళతానని రేవంత్ ప్రకటించారు. అయితే.. అదే జిల్లాలో ఉన్న ఏకైన ఎమ్మెల్యే అయిన తనకు సమాచారం ఇవ్వకుండా.. ఎర్రవెల్లికి రేవంత్ ఎలా వెళతారన్నది జగ్గారెడ్డి అభ్యంతరం.
ఇదే విషయాన్ని జగ్గారెడ్డి బాహాటంగా ప్రకటించటం.. రేవంత్ రెడ్డి తన వ్యవహారశైలిని మార్చుకోవాలని.. అందరిని కలుపుకుపోవాలని కోరారు. ఒకవేళ అలా సాధ్యం కాకుంటే రేవంత్ ను మార్చాలంటూ సోనియాగాంధీకి లేఖ రాశారు. ఈ లేఖ లీక్ కావటంతో ఇప్పుడు దుమారంగా మారింది. ఈ లేఖ ఎపిసోడ్ ను రేవంత్ సీరియస్ గా తీసుకున్నట్లుగా చెబుతున్నారు. పార్టీ అధినేత్రికి జగ్గారెడ్డి రాసిన లేఖ లీక్ అయిన నేపథ్యంలోసమావేశమైన పార్టీ క్రమశిక్షణ కమిటీ.. తమ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడింది.
సోనియాకు రాసిన లేఖ లీక్ కావటాన్ని తాము క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు తీసుకుంటామని.. జగ్గారెడ్డిని పిలిపించి వివరణ కోరుతామని కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న చిన్నారెడ్డి పేర్కొన్నారు. కొన్ని చోట్లు గ్రూపు రాజకీయాలు నడుస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని.. ఆయా ప్రాంతాల్లో కమిటీ పర్యటించి సమస్యల్ని పరిష్కరిస్తుందని చెప్పారు. ఇదిలా ఉంటే.. చిన్నారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన జగ్గారెడ్డి.. తన గురించి చిన్నారెడ్డి మాట్లాడినందుకే తాను మీడియాతో మాట్లాడుతున్నట్లుగా జగ్గారెడ్డి పేర్కొంటూ.. తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు.
తాను సోనియాగాంధీకి రాసిన లేఖ లీక్ కావటం క్రమశిక్షణా చర్య అయితే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచార వేళ పార్టీ నిబంధనల్నిఉల్లంఘించి మరీ పెద్దపల్లి అభ్యర్థిని ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు క్రమశిక్షణ పరిధిలోకి రాడా? నా సొంత ఉమ్మడి జిల్లాలోని ఏకైక ఎమ్మెల్యే.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నాకు చెప్పకుండా పరా్టీ కార్యక్రమాన్ని ప్రకటిస్తే కక్రమశిక్షణ కిందకు రాదా? వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఇన్ ఛార్జిని అయిన నాకు తెలీకుండా భూపాలపల్లిలో రచ్చబండకు వెళుతున్నట్లు ప్రకటించటం ఏమిటి? అసలు క్రమశిక్షణ పాటించని రేవంత్ రెడ్డికి క్రమశిక్షణ గురించి మొదట చెప్పాలంటూ ఫైర్ అయ్యారు.
తాను కమిటీ ముందు హాజరవుతానని.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ ను కూడా కమిటీ ముందుకు పిలిచి మాట్లాడాలని డిమాండ్ చేశారు. జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాల్లో కొన్ని కరెక్టుగానే ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. అయితే.. వాదన ఎంత సబబుగా ఉన్నా.. పార్టీకి నష్టం వాటిల్లకుండా వ్యవహరించాల్సిన బాధ్యత పార్టీ నేతల మీద ఉందని.. ఆ విషయంలో జగ్గారెడ్డి తప్పు చేశారంటున్నారు. ఏమైనా.. తమ ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థిని వదిలేసి.. పార్టీ ఇమేజ్ దెబ్బ తీసే అంశాల మీద జగ్గారెడ్డి ఫోకస్ పెట్టటం సరికాదంటున్నారు. మరి.. జగ్గారెడ్డి కోపాన్ని.. ఆయన ఆగ్రహాన్ని రేవంత్ ఏ రీతిలో తగ్గిస్తారన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.