సెలబ్రిటీల ప్రపంచంలో ఆయన ఖచ్చితంగా ఒక సెలబ్రిటీ. కాకపోతే ఆయన స్పెషాలిటీ నేకెడ్ నెస్. అవును దిగంబరంగా.. ఒంటిమీద నూలుపోగులేకుండానే తిరుగుతూ ఉంటారు. కానీ సెలబ్రిటీ లు ఆయనంటే అపార ఆదరణ చూపిస్తారు. ఆయన పేరు తరుణ్ సాగర్. చాలా ప్రఖ్యాతిగల జైన సన్యాసి. తాను దిగంబరంగానే బాహ్యప్రపంచంలో తిరుగుతూ - ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇస్తూ ఉండడం ఆయన స్పెషాలిటీ.
అలాంటి స్పెషల్ నేక్ డ్ సన్యాసితో.. అసలే ఆరెస్సెస్ భావజాలం పుష్కలంగా ఉన్న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్జర్ ఆయన ప్రసంగాన్ని ఏర్పాటుచేశారు. ఆ సన్యాసి ప్రసంగాన్ని ఏదో తమ ఇంటి కార్యక్రమంలాగా చేసుకుని ఉంటే వేరే సంగతి. ఏకంగా అసెంబ్లీలో అందరు సభ్యుల కోసం ఆయన ప్రసంగం పెట్టించారు. అయితే ఆ దిగంబర సన్యాసి మాత్రం.. తన ప్రసంగంలో ఎక్కువ భాగం అమ్మాయిల గురించే మాట్లాడారు.
తప్పుగా ఏం కాదులెండి. అమ్మాయిలు పుట్టబోతున్నారంటే భ్రూణ హత్యలు జరిగే మనదేశంలో అమ్మాయిలకు ఆదరణ పెరగాలనే దిశగా ఆయన మాటలన్నీ సాగాయి. ఆడబిడ్డలు లేని ఇంట్లో మీ కూతుర్ని ఇచ్చి పెళ్లి కూడా చేయవద్దని ఈ జైనస్వామి పిలుపు ఇచ్చారు. ఆడబిడ్డలు లేని ఇంట్లో సన్యాసులు భిక్ష తీసుకోవద్దని - కుమార్తెలు ఉన్న రాజకీయ నాయకులకు మాత్రమే ఓట్లు వేయాలని ఆయన పిలుపు ఇచ్చారు.
ఉన్నదున్నట్టు సూటిగా మాట్లాడే వ్యక్తిగా ఈ దిగంబర స్వామికి పేరు. మన దేశంలో లింగనిష్పత్తి సమానంగా ఉండాలంటూ ఆయన ఫోకస్ మొత్తం దానిమీద పెట్టడం విశేషం. పీవీ సింధు - సాక్షి మాలిక్ రూపంలో ఇద్దరు భారత పుత్రికలు మన దేశ పరువు నిలబెట్టారంటూ ఆయన ఒలింపిక్స్ విజేతల్ని అభినందించారు.
అలాగే పాకిస్తాన్ గురించి, ఇతర అంశాల గురించి ఆయన చాలా జోకుల్ని వేసి సభికుల్ని నవ్వించారట కూడా. అయితే హర్యానా అసెంబ్లీ పెద్దలు.. ఈ దిగంబర సన్యాసి మాదిరిగానే.. మరికొందరు మత పెద్దలతో కూడా అప్పుడప్పుడూ ఇలాంటి ప్రసంగాలు ఏర్పాటుచేస్తారట. వారు ఎన్ని కొత్త ఆలోచనలు చెబుతారో ఏంటో?