తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల్లో... ప్రత్యేకించి జైపాల్ రెడ్డి వంటి సీనియర్లలో భావదాస్యం ఇంకా తొలిగిపోయినట్లు లేదు. తెలంగాణ సొంత రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా.. ఆయన ప్రజలకు తనలోని భావదాస్యాన్నే నూరిపోయాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. వరంగల్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో ఓ ప్రెస్ మీట్ ద్వారా తాను కూడా పార్టీ విజయానికి కష్టపడుతున్నట్లుగా కనిపించడానికి ప్రయత్నించిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి.. వరంగల్ స్థానాన్ని గెలిచి.. సోనియమ్మకు కానుకగా ఇవ్వాలని జనానికి పిలుపు ఇచ్చారు. సోనియాకు కానుకగా ఇవ్వాలంటే గనుక.. అసలు మొదటికే మోసం వస్తుందేమో అని పలువురు వ్యాఖ్యానిస్తూ ఉండడం విశేషం.
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎన్నికల్లో ప్రజలకు ఏం హామీ ఇవ్వాలో.. ఎందుకోసం తమను గెలిపించాలో, ఎందుకు అధికార తెరాస ను ఓడంచాలో చెప్పడానికి పెద్దగా ఏమీ పాయింట్లు తోస్తున్నట్లు లేదు. ఒకవైపు అసలు ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థి రాజయ్య వచ్చి.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు కాంగ్రెసు మీద సానుభూతితో వరంగల్ లో తనకు ఓట్లు వేయాలంటారు. రాష్ట్రం కాంగ్రెస్ ఇచ్చి ఉండవచ్చు గాక.. దానికి వారి మీద సానుభూతి చూపించాల్సిన అగత్యం ఏమిటి? రెండు తెలుగు రాష్ట్రాల్లోను పతనం అయిపోయినందుకు సానుభూతి చూపించాలా? అయినా పతనం అయినందుకు కారణం.. వారు ఆడిన డ్రామాలే తప్ప.. రాష్ట్రం ఇవ్వడం అనేది కారణం కాదు. ఆయనది ఒక తీరు అయితే ...
ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి జనాన్ని ప్రభావితం చేసేయాలని అనుకుంటున్న జైపాల్ రెడ్డి తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు వరంగల్ ఎంపీ స్థానాన్ని కానుకగా ఇవ్వాలని ప్రజలకు ఉద్బోధిస్తున్నారు. అధిష్ఠానాన్ని కాకా పట్టడం తప్ప మరొకటి తెలియని ఈ నేతలు గతంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా ఇదే తరహా ప్రచారంతోనే పార్టీ పుట్టి ముంచారు. సోనియా ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని కానుకగా ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాష్ట్రాన్ని ఆమెకు కానుకగా ఇవ్వాలని ప్రజలను కోరారు. వచ్చిన రాష్ట్రాన్ని మళ్లీ కానుకగా ఇవ్వడం ఏంటి? అనుకుంటూ జనం దారుణంగా తిప్పికొట్టారు. ఇప్పుడు మళ్లీ వరంగల్ స్థానాన్ని కానుకగా ఇవ్వాలంటున్నారు. అలా అంటే మొదటికే మోసం బాసూ అంటూ కార్యకర్తలు ఆవేదన చెందుతుండడం విశేషం.
ప్రజల్లో గెలవలేకపోతే రాజ్యసభ ద్వారా అయినా నిత్యం ఎంపీగా ఉండాలని కోరుకునే జైపాల్ రెడ్డి లాంటి వారికి సోనియా భజన చేయడం తప్ప.. తమ భక్తిని నిరూపించుకోవడం తప్ప.. ఎన్నికల్లో పార్టీ ఏమైపోతే మాత్రం పట్టింపు ఉంటుందా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.