జైశంకర్.. ప్రధానిగా నరేంద్రమోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక మన దేశ విదేశాంగ విధానం పక్కగా ఉండాలని.. ఆ శాఖలో పనిచేసి రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి జైశంకర్ ను ఏకంగా విదేశాంగ శాఖ మంత్రిని చేశాడు మోడీ.
ఆయన అనుభవంతో ఇప్పుడు భారత విదేశీ విధానం పటిష్టంగా మారింది. ఇటు రష్యా యుద్ధం విషయంలో.. పాకిస్తాన్ తో.. అటు అమెరికాతో సంబంధాలు నెరపడంలోనూ జైశంకర్ వ్యవహరించిన తీరుకు అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట పెరిగింది. ఏకంగా అమెరికాకే షాకిచ్చేలా జైశంకర్ ప్రసంగిస్తున్న తీరు భారతీయులను ఫిదా చేస్తోంది.
భారత్ లోని మత స్వేచ్ఛపై గతంలో విమర్శించిన అమెరికా విదేశాంగ మంత్రికి అక్కడి నల్లజాతి వారిపై దాడుల సంగతి ఏంటని సూటిగా ప్రశ్నించిన ఘనత జైశంకర్ సొంతం. ఏదైనా సూటిగా లేవనెత్తుతూ భారత్ విధానాన్నే జైశంకర్ మార్చేశాడు. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్-అమెరికా సంబంధాలపై తాను చాలా ఆశాజనకంగా ఉన్నట్లు జైశంకర్ తెలిపారు. గత నాలుగేళ్లుగా ఇరుదేశాల దౌత్య సంబంధాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. నిజాయితీగా చెప్పాలంటే అమెరికా దగ్గరైంది.
భారత్ వంటి దేశాలకు మార్గాలు తెరిచింది. సంప్రదాయ పొత్తులకు అతీతంగా ఆలోచిస్తోంది. క్వాడ్ సహా కొన్ని కూటముల్లో కలిసి పనిచేస్తోందని.. అమెరికాతో కలిసి ప్రపంచ దిశను మార్చేందుకు కలిసి పనిచేస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ ముందుకు సాగుతామన్నారు.
దీన్ని బట్టి అమెరికా స్నేహ హస్తం చాటితే అలాగే స్నేహం చేస్తామని.. వద్దనుకుంటే వదులుకుంటామని జైశంకర్ క్లియర్ కట్ గా అమెరికా గడ్డపైనే చెప్పినట్టైంది. దీనికి అమెరికా విదేశాంగ మంత్రి కూడా కాసింత కఠినంగా మాట్లాడేశారు.
ఇక అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ మాట్లాడుతూ.. 'ప్రపంచంలో రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలు దశ, దిశను మార్చేందుకు సామర్థ్యాలున్నాయని.. మా మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నా కలిసి పనిచేస్తామని.. భవిష్యత్తులోనూ విభేదాలు ఉన్నా నాణ్యమైన మా బంధం ఉండడం వల్లే విడిపోకుండా ఉంటున్నామని ట్విస్ట్ ఇచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.