సోషల్ మీడియాలో ఇప్పుడో వీడియో వైరల్ గా మారిపోయింది. దాదాపు రెండు నెలల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించినదే అయినా కూడా ఈ వీడియో తెగ వైరల్ అయిపోయింది. నిశ్చబ్ధానికే కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న గ్రంథాలయం... అందులోనూ ఓ ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయంలోకి లాఠీలతో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు... అక్కడ బుద్ధిగా చదువుకుంటున్న విద్యార్థులపై లాఠీలు ఝుళిపిస్తే... దానికి సంబంధించిన వీడియా బయటకు వస్తే... వైరల్ కాక ఎందుకుంటుంది? సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారన్న అక్కసుతో ఢిల్లీలోని జామియా వర్సిటీ విద్యార్థులపై ఓ రేంజి ఆగ్రహాన్ని ప్రదర్శించిన అక్కడి పోలీసులు... ఒకానొక రోజు... ఏకంగా వర్సిటీలోని లైబ్రరీలోకి ప్రవేశించి... లైబ్రరీలో నిశ్చబ్దంగా చదువుకుంటున్న విద్యార్థులపై లాఠీలతో ఇష్టారాజ్యంగా బాదారు. ఈ వీడియో ఇప్పుడు బయటకు రాగా... అదే వైరల్ గా మారిపోయింది.
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఇటీవల ప్రతిపాదించిన సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. వాటిలో జామియా విద్యార్థులు కొనసాగిస్తున్న ఉద్యమాలు నేషనల్ మీడియాలో హైలెట్ గా నిలుస్తున్నాయి. ఎక్కడికక్కడ ఉద్యమాలను అణచివేయాలన్న కేంద్రం ఆదేశాలతో పోలీసులు చాలా ప్రాంతాల్లో పరిధి మీరి వ్యవహరిస్తున్నారు. అయితే ఎక్కడ కూడా తమ అతికి సంబందించిన దృశ్యాలు బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం జామియా లైబ్రరీలోకి వెళ్లి విద్యార్థులను చితకబాదిన వ్యవహారం కూడా బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఆ ఘటన జరిగిన రెండు నెలలకు ఎలాగోలా బయటకు వచ్చిన ఈ వీడియో కలకలమే రేపుతోంది.
ఏదో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన జరుగుతున్నప్పుడు... భారీ సంఖ్యలో గుమికూడిన జన సమూహాన్ని, దాడికి తెగబడుతుందని భావించే సమూహాన్ని చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించుతారు. అయితే జామియా వర్సిటీ లైబ్రరీలోకి ఆర్ఏఎఫ్ దళాలకు చెందిన కొందరు సాయుధ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రాగానే... కూర్చుని శ్రద్ధగా పుస్తకాలు చదువుకుంటున్న విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేశారు. చేతుల్లోని లాఠీలతో విద్యార్థులపై విరుచుకుపడిన పోలీసులు... విద్యార్థులు లైబ్రరీని వీడి బయటకు పరుగులు పెట్టేదాకా విశ్రమించలేదు. ఈ ఘటనకు చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం వైరల్ కావడం సంచలనంగా మారిపోయింది.
వీడియో కోసం క్లిక్ చేయండి