సభలో ఉన్నాజానాపై.. లేక ఎర్రబెల్లిపై వేటు పడల

Update: 2015-10-05 06:18 GMT
విపక్షాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించటం.. చూసీ చూడనట్లుగా ఉండటం సాధ్యం కాదన్న విషయాన్ని తెలంగాణ అధికారపక్షం మరోసారి తేల్చి చెప్పేసింది. తమకు అడ్డు వచ్చే వారి విషయంలో నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయన్న సంకేతాల్ని పంపుతూ తాజాగా వేసిన వేటు నిర్ణయం చర్చనీయాంశంగా ఉంది.

సభలో ఉన్న కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి.. మజ్లిస్ సభ్యుల మినహా సభలో ఉన్న విపక్ష సభ్యలుపై సస్పెన్షన్ వేటు పడటం.. అది కూడా.. సమావేశాల కాలం మొత్తం ఉండేలా తీవ్రంగా నిర్ణయం తీసుకోవటం గమనార్హం. మరో విషయం ఏమిటంటే.. కేసీఆర్ సర్కారు సస్పెన్షన్ వేటు నుంచి తప్పించుకున్న వారిలో సభలో ఉన్న జానారెడ్డితో పాటు.. రహస్య మిత్రపక్షంగా పేరున్న మజ్లిస్ సభ్యులపైనా పడలేదు.

అదే సమయంలో వేటు వేసే సమయంలో తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సైతం అసెంబ్లీలో లేకపోవటంతో ఆయన కూడా సస్పెన్షన్ వేటు నుంచి తప్పించుకున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అటు జానా.. ఇటు ఎర్రబెల్లి ఇద్దరూ తెలంగాణ అధికారపక్షం పట్ల కూసింత సాఫ్ట్ కార్నర్ ఎక్కువన్న పేరు ఉన్న వారు కావటం గమనార్హం. మొత్తానికి కీలక పార్టీలకు చెందిన ఇద్దరు శాసనసభాపక్ష నేతలపై వేటు పడకుండా.. వారి సభ్యులపై వేటు పడటం విశేషమే. దీనిపై స్పందించిన జానారెడ్డి.. చరిత్రలో ఇలాంటివి జరగలేదని.. విపక్షాల మొత్తంపైనా సస్పెన్షన్ వేయటం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని.. ఇదే తొలిసారి అని వాపోయారు.
Tags:    

Similar News