అంచనాలకు దొరక్కుండా వ్యవహరించడంలో ముందుండే కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి మరోమారు అదే మార్క్ ప్రకటన చేశారు. ఈ దఫా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కేంద్రంగా జానారెడ్డి చర్చకు తెరలేపారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జానారెడ్డి కోరడంతో పాటు మరిన్ని ఆసక్తికరమైన స్టేట్‌మెంట్లు ఇచ్చారు.
మొక్కలు నాటడం భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరమని జానారెడ్డి అన్నారు. ఇందు కోసం ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మొక్కల పెంపకం వల్ల ఆకుపచ్చ తెలంగాణ సాధ్యమవుతుందని ఇది రాష్ర్టానికి వన్నెతెస్తుందని పేర్కొన్నారు. ప్రజలంతా తమ తమ పరిధిలో మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు సైతం నడుం కట్టాలని జానారెడ్డి కోరారు. హరితహారానికి మద్దతుగా జానారెడ్డి చేసిన ప్రకటన ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ స్వచ్ఛందం - హరిత తెలంగాణ వంటి వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు తెరలేపుతున్నాయంటున్నారు.