ప్రస్తుతం భేషుగ్గా పనిచేస్తున్న తెలంగాణ సచివాలయాన్ని వాస్తు కారణాల రీత్యా కూల్చివేసి కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వెనుక వాస్తు దోషం ఒకటే కారణం కాదట. ఎప్పట్లాగే ప్రతి విషయంలోనూ తనదైన ముద్ర వేసుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన దోరణే కారణమని సీఎల్పీ నేత జానారెడ్డి ఆరోపించారు. దిల్ సుఖ్ నగర్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ సాధన కోసం విద్యార్థులు పోరుగర్జన నిర్వహించి సందర్భంగా హాజరైన ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి మాట్లాడుతూ వివిధ పథకాల పేరుతో కాంట్రాక్టర్లకు వేలకోట్ల రూపాయలు ధారపోస్తున్న టీఆర్ ఎస్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించకపోవడం హేయమన్నారు. గతంలో ప్రతి ముఖ్యమంత్రి తమ హయాంలో సచివాలయంలో విస్తరణ కోసం అదనంగా బ్లాకులు నిర్మించారని ఆయా భవనాల శిలాఫలకాలపై వారి పేర్లు ఉన్నాయని అన్నారు. ప్రస్తుత సీఎం కేసీఆర్ గత ముఖ్యముంత్రుల పేర్లున్న శిలాఫలకాలతో సహా సచివాలయం మొత్తాన్ని కూల్చి కేవలం తన పేరును శిలాఫలకంపై చెక్కుకునేందుకు కొత్త్భవన నిర్మాణానికి పూనుకున్నారని ఎద్దేవా చేశారు.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ ఎస్ ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్ల తెలంగాణలో విద్యారంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల కాకపోవడం వలన రాష్ట్రంలో సుమారు 3200ప్రైవేటు కళాశాలలు మూసివేసే పరిస్థితి నెలకొందన్నారు. తద్వారా 14లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారనుందన్నారు. రెండున్నర లక్షల మంది లెక్చరర్లు - నాన్ టీచింగ్ సిబ్బంది ఆయా కళాశాలల నుండి 6నెలలుగా జీతాలు అందక కనాకష్టం పడుతున్నారన్నారు. 2008లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాలతో అప్పటి ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనార్టీ విద్యార్థులందరికీ లబ్ధి కలిగే విధంగా ఫీజురీయంబర్స్ మెంట్ పథకం పెట్టిందని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమకు మరింత మెరుగైన భవిష్యత్ లభిస్తుందని అనుకున్న విద్యార్థులు నిరాశ - నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులకు బోధనా రుసుము బకాయిలు పూర్తిగా విడుదల చేసేవరకు విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. బంగారు తెలంగాణ సాధన పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి ఆర్‌సి కుంతియా విమర్శించారు. ఈ సభలో మలక్ పేట్ - దిల్ సుఖ్ నగర్ - చైతన్యపురి - ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుండి పలు ప్రభుత్వ - ప్రైవేటు కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/