సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న జానారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుపరిచితులే. ఉమ్మడి ఏపీలో టీడీపీతో రాజకీయాలు ప్రారంభించిన జానా రెడ్డి.. అన్నగారు ఎన్టీఆర్ హయాంలో రవాణా శాఖ మంత్రిగా వ్యవహరించారు. తర్వాత.. కాంగ్రెస్‌లోకి అడుగు పెట్టారు. ఈ పార్టీలోనూ వైఎస్ హయాంలో మంత్రిపదవులు అందుకున్నారు. హోం మంత్రిగా కూడా పనిచేశారు. అయితే.. ఇటీవల కాలంలో ఆయన పరాజయం పాలవుతున్నారు. 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో నాగార్జున సాగర్ వంటి కంచుకోటలోనే పరాజయం పాలయ్యారు. ఇక్కడ నుంచి టీఆర్ ఎస్ నేత, దివంగత నోముల నర్సింహయ్య విజయం సాధించారు.
ఆయన హఠాన్మరణంతో వచ్చిన ఉప ఎన్నికలోనూ జానా రెడ్డి పరాజయం పాలయ్యారు. పైగా.. గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం.. యవతకే ప్రాదాన్యం దక్కుతుండడంతో ఇక, తాను ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పి.. సలహాదారుగానే ఉండాలని భావిస్తున్నట్టు కొన్ని రోజులుగా రాజకీయాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌లోనూ.. ఇదే చర్చ సాగుతోంది. అయితే.. ఈ క్రమంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నప్పటికీ.. ఆయన కుమారులు.. ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతుండడం గమనార్హం.
ఇప్పటికే.. జానా ఇద్దరు కుమారులు .. వచ్చే ఎన్నికల్లో పోటీ కి రెడీ అయ్యారని..వారు తమ తమ నియోజకవర్గాలను కూడా ఎంచుకున్నారని.. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే కేడర్ ను కూడా బలోపేతం చేసుకుంటున్నారని..కాంగ్రెస్‌లో టాక్ వినిపిస్తుండడం గమనార్హం. ఇద్దరు కుమారులు రాజకీయాల్లో ఎదిగేలా.. జానా వ్యూహాత్మకంగా వారిని నడిపిస్తున్నారని.. ఆయన అనుచరులు చెబుతుండడం గమనార్హం.
నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జానా రెండో కుమారుడు జైవీర్.. పర్యటనలు ప్రారంభించాల ని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఈ ఇద్దరు కుమారులు కూడా కాంగ్రెస్ సీనియర్లను కలుస్తున్నారు. అదేవిధంగా ఉద్యమనాయకులకు కూడా చేరువ అవుతున్నారు. అదేసమయంలో జానా పెద్ద కుమారుడు.. రఘువీర్.. మిర్యాలగూడ నియోజకవర్గంపై దృష్టి పెట్టినట్టు సమాచారం. వాస్తవానికి రఘువీర్.. 2018లోనే మిర్యాలగూడ నుంచి పోటీ చేయాలని అఉకున్నారు. అయితే.. అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌గాంధీ.. ఒక కుటుంబానికి ఒక టికెట్ అనే పార్ములాను అమలు చేశారు.
దీంతో.. జానాకు మాత్రమే టికెట్ ఇచ్చారు. దీంతో రఘువీర్‌కు టికెట్ దక్కలేదు. ఇక, అటు సాగర్, ఇటు మిర్యాల గూడ నియోజకవర్గాలను పరిశీలిస్తే.. జానా రెడ్డికి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో రేపు ఈ ఇద్దరు కుమారులు టికెట్లు తెచ్చుకుంటే.. జానా వారి విజయానికి వ్యూహాలపై వ్యూహాలు వేసే అవకాశం ఉందని.. తన పలుకుబడిని మొత్తం వినియోగించి.. ఇద్దరినీ గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తారని.. పరిశీలకులు చెబుతున్నారు.,
ఒకవేళ రేపు ఒక్కరికే టికెట్ వచ్చినా.. గెలుపు దిశగా జానా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఇక, 2023లో జరిగే ఎన్నికల్లో జానా రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంటుందా? అనేది చూడాలి. ఇదిలావుంటే.. ప్రస్తుత కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్‌రెడ్డి.. జానాతో ప్రత్యేక అనుబంధాన్నే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఎప్పుడు అవకాశం ఉంటే.,. అక్కడ పలు కార్యక్రమాల్లో.. రేవంత్, జానాలు వేదికలు పంచుకుంటున్నారు. ఇప్పటికే రేవంత్ కూడా.. తాను జానకు మరో కుమారుడినని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేపు ఎన్నికల సమయానికి రేవంత్ జానా ఇద్దరు కుమారులకు కూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ అవకాశం ఉంటుందనే భావనతోనే.. జానా కుమారులు ఇద్దరూ కూడా.. వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.