ఇప్పటిదాకా హైదరాబాదుకే పరిమితమైన టాలీవుడ్ పవర్ స్టార్ - జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష బరిలోకి దిగేందుకు పక్కాగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన తాజా చిత్రం అజ్ఞాతవాసి చిత్ర షూటింగ్ ముగించుకున్న ఆయన కాస్తంత తీరిక దొరకగానే... ఏపీలో సుడిగాలి పర్యటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ విషయం కాస్తంత పక్కనబెడితే... ఏపీలో పవన్ కల్యాణ్ వేసే అడుగే కీలకంగా మారనుందన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో పవన్ కూడా తన పొలిటికల్ స్ట్రాటజీని ఒక్క ఏపీకే పరిమితం చేస్తున్నట్లుగా నవ్యాంధ్ర నూతన రాజధానికి సమీపంలో కొత్తగా కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన జనసేన కోశాధికారి రాఘవయ్య.... గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద 3.42 ఎకరాల భూమిని గుర్తించి... దాని యజమానులుగా భావిస్తున్న యార్లగడ్డ సుబ్బారావు - సాంబశివరావు - అంకినీడు ప్రసాద్ లతో లీజు ఒప్పందం కుదుర్చుకున్నారు. మూడేళ్ల కాల పరిమితి కలిగిన ఈ లీజు ప్రకారం ఏడాదికి ఒక్కో ఎకరానికి రూ.50 వేల చొప్పున చెల్లించేందుకు రాఘవయ్య ఒప్పందం చేసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
ఇంతదాకా బాగానే ఉన్నా... ఇప్పుడు ఆ స్థలంపై రాజుకున్న ఓ చిన్న వివాదం చూస్తుంటే... పెద్ద సమస్యగానే పరిణమించే అవకాశం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. అసలు ఆ స్థలం యార్లగడ్డ సుబ్బారావు - సాంబశివరావు అంకినీడు ప్రసాద్ లది కాదని మైనార్టీ వర్గానికి చెందిన వారు బయటకొచ్చేశారు. ముస్లిం ఐక్య వేదిక పేరిట బయటకు వచ్చిన కొందరు వ్యక్తులు సదరు స్థలం యార్లగడ్డ సుబ్బారావు - సాంబశివరావు - అంకినీడు ప్రసాద్ లది కాదని - వాస్తవానికి అది మోహిద్దీన్ అనే తమ వర్గానికి చెందిన వ్యక్తిదని ఇప్పుడు కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. మొహిద్దీన్ కు చెందిన స్థలాన్ని జనసేనకు ఇచ్చేందుకు యార్లగడ్డ సుబ్బారావు - సాంబశివరావు - అంకినీడు ప్రసాద్ లు ఎవరని కూడా వారు వాదిస్తున్నారు.
జనసేన లీజుకు తీసుకున్న సర్వే నెంబర్ 182/1లో ఉన్న స్థలం తమదని , దానిని అక్రమంగా జనసేన కార్యాలయం కోసం లీజుకు ఇచ్చారని ఆ కుటుంబం ఆరోపిస్తోంది. కోర్టు పరిధిలో ఆ వివాదం ఉందని, అటువంటి భూమిలో నిర్మాణాలు చేపట్టవద్దని విజ్ఞప్తి చేసింది. 1920 నుంచి ఈ భూమి తమ అధీనంలో ఉందని ఆ కుటుంబం తెలిపింది. 1981 నుంచి ఈ భూమి విషయంలో వివాదం ఉందని, 1997లో గుంటూరు కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఆ కుటుంబం చెబుతోంది. ఈ వివాదంపై సుబ్బారావు హైకోర్టును ఆశ్రయించడంతో స్టేటస్ కో ఇచ్చిందన్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని వారు జనసేనకు విజ్ఞప్తి చేశారు.
అంతేకాకుండా యార్లగడ్డ సుబ్బారావు - సాంబశివరావు అంకినీడు ప్రసాద్ లు జనసేన ప్రతినిధి రాఘవయ్యతో చేసుకున్న ఒప్పందం చెల్లదని కూడా ఓ బాంబు లాంటి వార్తను విడుదల చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే తాము పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లామని అయితే అందుకు పవన్ కల్యాణ్ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూమిని అన్యాయంగా లీజుకు తీసుకున్న జనసేన పార్టీపై న్యాయపోరాటం చేస్తామని మొహిద్దీన్ వారసులుగా చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు చెబుతున్నారు. చూస్తుంటే... తన పార్టీ కార్యాలయం కోసం పవన్ కల్యాణ్ లీజుకు తీసుకున్న స్థలం ఆయనకు చుక్కలు చూపించేలానే ఉందని చెప్పక తప్పదు.