శ‌ప‌థం చేశారు.. ప‌త్తా లేకుండా పోయారు.. జ‌న‌సేనాని తీరేంటి.. అభిమానుల టాక్‌!!

Update: 2022-10-29 03:43 GMT
వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని మ‌ట్టి క‌రిపించ‌న‌దే.. ఊరుకోను.. నిద్ర‌పోను.. అంటూ.. వ్యాఖ్యానించిన‌.. జ‌న‌సేన అధినేత‌.. కొన్ని రోజులు హ‌డావుడి చేశారు. విశాఖ కేంద్రంగా.. తాను నిర్వ‌హించాల‌ని అనుకున్న జ‌న‌వాణిని ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని.. చేసిందని.. దీనికి నిర‌స‌నగా.. ఈ కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేసుకుంటున్నాన‌ని.. ఆయ‌న ప్ర‌క‌టించారు. అదేస‌మయంలో పోలీసుల దూకుడు.. కార్య‌క‌ర్త‌ల‌పై న‌మోదైన కేసులు నేప‌థ్యంలో ప‌వ‌న్‌.. టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుతో చేతులు క‌లిపారు. త‌ర్వాత‌.. ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్రంగానే వినిపించాయి. వైసీపీ గూండాల‌ను అధికారం నుంచి తోసేస్తామ‌న్నారు.

ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేదేలేద‌ని.. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణే త‌మ‌కుధ్యేయ‌మ‌ని కూడా.. ప‌వ‌న్ చెప్పారు. చంద్ర‌బాబుసైతం.. తాము క‌లిసి.. పోరాడ‌తామ‌న్నారు. ఇంత జ‌రిగిన త‌ర్వాత‌.. జ‌న‌సేన‌లో అప్ప‌టి వ‌ర‌కు స్త‌బ్దుగా ఉన్న వాతావ‌ర‌ణం పోకుండా ఉంటుందా..? అంటే. ఉండదు! పోతుంది. పోయింది కూడా. నాయ‌కులు కూడా.. జ‌నసేనాని వ్యాఖ్య‌ల‌తో రిచార్జ్ అయ్యారు. త‌మ నాయ‌కుడు మంచి వ్యూహం వేశాడ‌ని అనుకున్నారు. అయితే.. ఇది జ‌రిగి అప్పుడే.. 10 రోజులు దాటిపోయింది. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు ఉలుకు ప‌లుకు వినిపించ‌డం.. లేదు. క‌నిపించ‌డ‌మూ లేదు. క‌నీసం.. భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై ఎలాంటి రోడ్ మ్యాప్‌ను కార్య‌కర్త‌ల‌కు కానీ..నేత‌ల‌కు కానీ ఇస్తున్న‌దీ లేదు.

మ‌రి .. దీనిని ఎలా చూడాలి? అనేది.. జ‌న‌సేన నేత‌ల మాట. ఎందుకంటే.. ప‌వ‌న్ తెచ్చిన ఊపుతో ఇక‌, అందుకుని.. పుంజుకుందామ‌ని అనుకున్న నాయ‌కులు.. త‌ర్వాత‌.. ప‌వ‌న్ ప‌త్తా లేకుండా.. పోవడంతో అవాక్క‌వుతున్నారు. ఇదేంది.. అని ప్ర‌శ్నిస్తున్నారు. పోనీ.. ఆయ‌న త‌ర‌ఫున నాగ‌బాబు కానీ.. ఇత‌ర నేత‌లు కానీ.. వాయిస్ వినిపిస్తున్నారా? అంటే. అది కూడా.. అమావాస్య‌కు పౌర్ణ‌మికి ఒక‌సారి వ‌చ్చి.. ఇలా హ‌డావుడి చేయ‌డం.. అలా వెళ్లిపోవ‌డం.. ప‌వ‌న్‌కు ఇటీవ‌ల కాలంలో ప‌రిపాటిగా మారిపోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. నిజానికి ఇప్పుడు ప్ర‌జ‌లు ఆల్ట‌ర్నేట్ కోరుకుంటున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ లాంటి వ్య‌క్తులు బ‌లంగా నిల‌బ‌డేందుకు కూడా.. చాన్స్ ఉంది.

కానీ, ఇలా.. పుబ్బ‌కోసారి.. అమావాస్య కోసారి.. అన్న‌ట్టుగా రావ‌డం.. హ‌ల్చ‌ల్‌చేయ‌డం.. వెళ్లిపోయి.. ఆక్ష‌న్‌-క‌ట్ అన‌డంతో ప‌వ‌న్‌పై.. ప్ర‌జ‌ల్లో ఒక విధ‌మైన అభిప్రాయం మాత్రం ప్ర‌బ‌లుతోంది. ఎలా న‌మ్మాలి? ఆయ‌న ఎప్పుడు రాజ‌కీయాలు చేస్తారో.. ఎప్పుడు.. షూటింగులు చేస్తారో.. తెలియ‌దు. అనే చ‌ర్చ మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గంలో ఎక్కువ‌గా వినిపిస్తోంది.

దీనికి తోడు. వైసీపీ నాయ‌కులు కూడా.. ఇదే ప్ర‌చారం చేస్తున్నారు. ఫ‌లితంగా.. పార్టీ పెట్టి ఎనిమిది సంవ‌త్స‌రాలైనా..నిల‌క‌డైన రాజ‌కీయాలు చేయ‌డంలేద‌ని.. పార్టీలోని కొంద‌రు మేధావులు సైతం. భావిస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా.. త‌న వ్య‌క్తిగ‌తంగా రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటారా? అనేది ప్ర‌శ్న‌. చూడాలి.. ఏం చేస్తారో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News