ఈ లెక్క‌న సీఎం సీటుపై జానా క‌న్నువేసిన‌ట్లే

Update: 2018-05-01 13:06 GMT
కాంగ్రెస్ పార్టీలోని సీనియ‌ర్ల‌లో ఒక‌రు. ఆ పార్టీలో అంద‌రూ గౌర‌విస్తార‌నే పేరున్న అతికొద్దిమంది నాయ‌కుల్లో ముఖ్యుడు అయిన సీఎల్పీ నాయ‌కుడు జానారెడ్డి ఇటీవ‌లి కాలంలో ఒకింత స్త‌బ్ధుగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు అధికార టీఆర్ఎస్‌, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య ఘాటు విమ‌ర్శ‌లు సాగుతున్న‌ప్ప‌టికీ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్‌ రెడ్డి వ‌ర్సెస్ టీఆర్ ఎస్ ముఖ్య నేత‌లు అన్న‌ట్లుగా కౌంట‌ర్లు పేలుతున్న‌ప్ప‌టికీ ఆయ‌న కూల్‌ గా ఉంటున్నారు. అలాంటి జానారెడ్డి త‌న మౌనం వీడి తాజాగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. త‌ద్వారా ప‌రోక్షంగా త‌న‌ది సీఎం రేంజ్ అని చెప్ప‌క‌నే చెప్పార‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే...న‌ల్ల‌గొండ జిల్లాలోని కాంగ్రెస్ నాయ‌కులు ఎవ‌రూ గెల‌వ‌ర‌ని, వాళ్లంతా ప్ర‌జ‌ల‌కు ఎప్పుడో దూర‌మైపోయార‌ని జిల్లాకు చెందిన మంత్రి జగ‌దీశ్ రెడ్డి ఆరోపించారు. ప్ర‌జాసంక్షేమం ప‌ట్ట‌ని ఆ నాయ‌కుల‌ను గెలిపించేందుకు న‌ల్ల‌గొండ ప్ర‌జ‌లు సిద్ధంగా లేర‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న జానారెడ్డి త‌నపై చేసిన‌ కామెంట్ల‌కు క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చింద‌ని అయితే వాటిని అమ‌లు చేయ‌డం లేద‌ని ఆరోపించింది. అయిన‌ప్ప‌టికీ మంత్రులు అదికార గ‌ర్వంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. మంత్రుల మాట‌లు - ప్ర‌భుత్వం ప‌నితీరును చూసి రాబోయే ఎన్నిక‌ల్లో ఎవ‌రిని గెలిపిస్తారో ప్ర‌జ‌లే తేల్చుకుంటార‌ని జానారెడ్డి వెల్ల‌డించారు. ప్రజా సమస్యలు అసెంబ్లీలో నిలదీస్తే అప్రజాస్వామికంగా పాలనా సాగిస్తోందని అసెంబ్లీలో - బయట కూడా కాంగ్రెస్‌ ను అణ‌గదొక్కుతోందని ఆరోపించారు. అధికారంలో ఉన్న లేకున్నా కాంగ్రెస్ ప్రజల ప‌క్షాన ఉంటుందన్నారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిపాల‌న ప్ర‌క‌ట‌న‌ల్లో ఒక‌తీరు...ఆచ‌ర‌ణ‌లో ఇంకో తీరు ఉంద‌ని జానారెడ్డి ఆరోపించారు. త‌మ ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కం అని చెప్పుకొనే మిష‌న్ భ‌గీర‌థ‌తో ఇప్ప‌టివ‌ర‌కు స‌ర్కారు ఒక్క ఇంటికైనా నీటిని అందించిందా అని జానారెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు స‌హా మిగులు బ‌డ్జెట్ వంటి అంశాల్లో ప్ర‌భుత్వం చెప్పేదొక‌టి...ఆచ‌ర‌ణ‌లో ఉన్న‌ది ఒక‌ట‌ని జానారెడ్డి మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా జానారెడ్డి ఆస‌క్తిక‌ర‌మై అంశాన్ని వెల్ల‌డించారు. అస‌లు తాను మంత్రుల కామెంట్ల‌పై స్పందిచ‌వద్ద‌ని అనుకున్నాన‌ని ఇక నుంచి సీఎం చంద్ర‌బాబు మాట్లాడితే త‌ప్ప తాను స్పందించ‌న‌ని వెల్ల‌డించారు. త‌ద్వార త‌న‌ది ముఖ్య‌మంత్రి స్థాయి అని ప‌రోక్షంగా వెల్ల‌డించారని అంటున్నారు.


Tags:    

Similar News