టీడీపీ జనసేనకు ఇచ్చే సీట్లు కన్ఫర్మ్...?

Update: 2023-06-26 08:00 GMT
పొత్తులు ఉంటాయని పవన్ పదే పదే చెబుతూ వచ్చారు. మధ్యలో సీఎం తానే అని కూడా అంటున్నారు. అయితే పవన్ మనసులో మాట మాత్రం టీడీపీతో కలసి వెళ్దామనే అని అంటున్నారు. ఆ మేరకు పొత్తులు కుదిరాయని సీట్లు కూడా దాదాపుగా కన్ఫర్మ్ అయ్యాయని అంటున్నారు. అందుకే వారాహి రూట్ మ్యాప్ కూడా ఆయన సీట్లలోనే ముందుకు సాగుతోందని అంచనా కడుతున్నారు.

పొత్తులలో భాగంగా జనసేనకు ఇచ్చేవి పాతిక నుంచి ముప్పయి సీట్లు అని అంటున్నారు. బీజేపీ కూడా కలిస్తే ఆ పార్టీకి కొన్ని సీట్లు ఇవ్వడానికి టీడీపీ అట్లే పెట్టుకుని ఉంచింది అని అంటున్నారు. ఇలా ఒక ముప్పయి అయిదు సీట్లను పొత్తులలో ఉన్న పార్టీలకు ఇస్తూ నికరంగా టీడీపీ 140 సీట్లకు పోటీ చేయాలని డెసిషన్ తీసుకుంది అని అంటున్నారు.

ఆ సీట్లలో కచ్చితంగా టీడీపీకి అధికారానికి సరిపడా 88 సీట్లు పై దాటి వస్తాయన్న నమ్మకం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే జనసేనకు పాతిక నుంచి ముప్పయి సీట్లు ఇస్తారని అందులో ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలలో ఇస్తారని అంటున్నారు. ఇక జనసేనకు ఇచ్చే సీట్లను చూసుకుంటే శ్రీకాకుళం లో ఒకటి, విజయనగరంలో ఒకటి, విశాఖలో గాజువాక, మాడుగుల అని అంటున్నారు. ఉభయ , గోదావరి జిల్లాలలో  పిఠాపురం, కాకినాడ రూరల్, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం, నర్సాపురం, తాడేపల్లి గూడెం, భీమవరం, నిడదవోలు జనసేనకు దక్కనున్నాయని అంటున్నారు.

అదే విధంగా దక్షిణ కోస్తా జిల్లాలలో  అవనిగడ్డ పెడన, కైకలూరు, విజయవాడ వెస్ట్ సీట్లు జనసేనకే ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది అని అంటున్నారు. అదే విధంగా చూస్తే గుంటూరు జిల్లాలో తెనాలి, .గుంటూరు పశ్చిమ సీట్లను జనసేన కోరుతోంది. ప్రత్తిపాడు సీటు అయితే  జనసేనకు ఖాయంగా ఇస్తారని తెలుస్తోంది.

ప్రకాశం జిల్లాలో  చూస్తే దర్శి నుంచి జనసేన పోటీ చేసేందుకు టీడీపీ పచ్చ జెండా ఊపేసినట్లుగా తెలుస్తోంది. ఇవి కాకుండా నెల్లూరు సిటీ, తిరుపతి  రాజంపేట అసెంబ్లీ సీట్లను కూడ  జనసేనకు కేటాయిస్తారని తెలుస్తోంది. మరో నాలుగైదు సీట్లలో కూడా జనసేన పట్టుబడుతోంది. ఆ లెక్కన చూస్తే పొత్తులో జనసేనకు ఇచ్చే సీట్లు పాతిక నుంచి ముప్పయి లోపుగా ఉంటాయని అంటున్నారు. దీనికి రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరింది అని అంటున్నారు

మరో వైపు చూస్తే ఏపీలో ఉన్న పాతిక ఎంపీ సీట్లలో జనసేనకు మూడు ఎంపీ సీట్లు ఇచ్చేందుకు కూడా ఒప్పందం కుదిరింది అని అంటున్నారు. ఆ సీట్లలో కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి పవన్ వారాహి యాత్ర అంతా ఒక వ్యూహం ప్రకారమే సాగుతోంది అని అంటున్నారు. ఆయన సీఎం అని అంటున్నది తన క్యాడర్ ని ఉత్సాహపరచడానికే అని ఆయనే చెప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అసెంబ్లీలో పాదం మోపుతుంది అని జనసేన అధినేత నిబ్బరం వ్యక్తం చేయడం వెనక ఉన్నది టీడీపీతో పొత్తు బలమే అని అంటున్నారు.

సీఎం గా పవన్ని చూడాలని అనుకుంటున్న వారే గోదావరి జిల్లాలలో ఎక్కువగా ఉన్నారు. అందుకే ఈ పొత్తులు సీట్లను ఇప్పట్లో బయటపెట్టకుండా సరైన సమయంలో ఫైనల్ లిస్ట్ ని విడుదల చేస్తారు అని అంటున్నారు. మరి ఈ లిస్ట్ జనసేనకు పాతిక నుంచి ముప్పయి సీట్లు అన్న ప్రచారంలో ఎంత వరకూ వాస్తవం ఉందో కూడా చూడాలని అంటున్నారు.

Similar News