పవన్ కళ్యాణ్ సినీ నటుడు, జనసేనాని. ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కి వీరాభిమానులు కాదు భక్తులే ఉన్నారని చెప్పాలి. అలాంటి పవన్ని అంటారా. ఆయనని తిడితే ఊరుకుంటామా అంటున్నారు జనసేన నేతలు. పవన్ని అలా తిడుతూ పోతే మాత్రం జనం అసలు సహించరని వైసీపీ నేతలమీద తిరగబడడం తధ్యమని ఆ పార్తీ రాజకీయ వ్యవహారాల కమిటీ మెంబర్ కోన తాతారావు హెచ్చరిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల మీద మాట్లాడుతూంటే మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రం ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమేంటని కోన ప్రశ్నించారు. మంత్రులకు పని లేదా శాఖలు చూడరా. ప్రజాలకు మేలు చేసే పనులు చేపట్టరా అని ఆయన నిలదీశారు. పవన్ అంటే ఏమనుకుంటున్నారు. ఆయన ఒక ప్రభజనం. ఆయన వెనక కోట్లాదిమంది ప్రజానీకం ఉన్నారని వైసీపీ నేతలు గుర్తుంచుకుని మాట్లాడితే మంచిదని ఆయన సూచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో అవాకులు చవాకులు మాట్లాడితే అవతల వారు ఎవరూ అని కూడా జనాలు చూడరని, వారికి ఆగ్రహం తెప్పిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త అని కొత్తరకం హెచ్చరికలను కోన తాతారావు జారీ చేశారు.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ వారానికి ఒకసారి వస్తేనే అంత వణుకుతున్నారు,వారాహీ రధమెక్కి ఇక ప్రతీ రోజూ ఏపీలో కలియతిరుగుతారని, అపుడు అసలు తట్టుకోలేరేమో అని ఆయన అంటున్నారు. తమ పార్టీ మొత్తం 175 సీట్లలో పోటీ చేయాలని అని చెప్పడానికి వైసీపీ నేతలు ఎవరని ఆయన ప్రశ్నించారు. తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు ఏమి చేస్తామో అది తమ వ్యూహమని తమని ఆదేశించే సీన్ వైసీపీకి ఎక్కడిది అని అంటున్నారు.
ముందు మీ పార్టీ సంగతి చూసుకోండి. వీలుంటే అన్నీ సర్దుకుని జాగ్రత్తగా ఉండండి అని సెటైర్లు వేశారు. ఎన్నికలు ఎపుడు వచ్చినా వైసీపీకి బంగాళాఖాతమే దారిగా ప్రజలు చూపిస్తారు అని ఆయన జోస్యం చెప్పారు. తమ పార్టీ ప్రజల కోసం ప్రజల మధ్యన పుట్టి పార్టీ అయితే వైసీపీ చంచల్ గూడా జైలులో పుట్టిన అవినీతి పార్టీ అని ఆ పార్టీకి తమను విమర్శించే నైతికత ఎక్కడిది అని కోన తాతారావు ఫైర్ అయ్యారు.
గత ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలిచామని లైట్ తీసుకోవద్దు. 2024 ఎన్నికల్లో 175 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకునే దమ్ము తమ పార్టీకి ఉందని కోన ధీమాగా చెబుతున్నారు. మొత్తానికి జనసైనికులు బదులు ఇవ్వడం కాదు, పవన్ని అంటే ప్రజలే తరిమికొడతారు అంటూ జనం అంతా తమవైపే అని జనసైనికుడు సరికొత్త రాజకీయ భాష్యం చెబుతున్నారు. పవన్ వెనక ఏపీ మొత్తం ఉంది అంటున్నారు.
మరి 1 సీటు గెలిచిన పవన్ వెంట జనబలం ఉంటే 151 సీట్లు గెలిచిన వైసీపీ వెంట ఎంత బలం ఉండాలని వైసీపీ వారు కూడా అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే జనాలకు ఇదేనా పని అని అన్న వారూ ఉన్నారు. రాజకీయ విమర్శలు అటూ ఇటూ చేసుకుంటూటే మధ్యన జనాలకు ఏమి పని అని అంటున్న వారూ ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.