నోటా ఓటర్లారా ...పవన్ మాట విన్నారా...?

Update: 2022-11-01 02:30 GMT
నోటాకు ఓటేయడం గత కొన్ని ఎన్నికల నుంచి బాగా అలవాటు అయిపోయింది. తమకు ఎవరూ నచ్చడం లేదని ఎంచక్కా పోలింగ్ బూత్ దాకా వెళ్ళి గంటల కొద్దీ నిలబడి కూడా నోటాకు గుద్దేసే బాపతు అంతకంతకు పెరిగిపోతోంది. 2019 ఎన్నికల్లో ఏపీలో నోటాకు గుద్దేసిన ఓట్లు ఏకంగా పది లక్షల దాకా ఉన్నాయట. దాంతో ఈ చిట్టాను బయటకు తీసిన జనసేనాని పవన్ కళ్యాణ్ నోటా భక్తుల మీద మండిపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే వారి మీద చెడుగుడు ఆడేశారు.

అరే సామీ ఏ అభ్యర్ధి నచ్చడంలేదు అంటూ నోటాకు వేసి మీరు చేస్తునందేంటో తెలుసా క్రిమినల్స్ కి పాలిటిక్స్ లో చాన్స్ ఇస్తున్నారు. మీ వల్ల ఇండైరెక్ట్ గా వారే రాజ్యం ఏలుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి.

ఎవరూ నచ్చకపోవడమేంటి. ఉన్న వారిలో ఎవరో ఒకరిని ఎంచుకుంటే కదా ఓటుకు అర్ధం. అలా ఓటు వేయకుండా నోటాకు వేయడం అంటే హక్కుని లేకుండా కాకుండా చేసుకోవడమే కదా అని పవన్ బాగానే క్లాస్ పీకారు.

అంతే కాదు ఈ దేశం మాకు నచ్చలేదు అని పాస్ పోర్టుని ఎవరైనా చింపేసుకుంటారా పోనీ అలా చేసేయండి అని ఆయన సెటైర్లు కూడా వేశారు. నోటాకు ఓటు వేయడం అంటే అదేదో మేధావితనం అనుకుంటున్నారు కానే కాదు అని పవన్ అంటున్నారు. నోటా పేరిట ఓటుని మళ్ళించడం అంటే దాన్ని వేస్ట్ చేయడమే అని ఆయన అంటున్నారు. ఇక ఓడిపోయే అభ్యర్ధులకు ఓటు వేస్తే తమ ఓటు వేస్టు అన్న ఫిలసఫీ కూడా ఓటర్లకు ఉందని, కానీ నోటాకు వేస్తే మాత్రం ఆ ఓటు మురిగిపోకుండా ఉంటుందా అని పవన్ గట్టిగానే తగులుకున్నారు.

కాబట్టి మీ ఓటు మీరు వేయండి, మీకు నచ్చిన వారికి వేయండి. నచ్చకపోయినా ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరికి వేయండి వీటి కంటే ముందు అసలు ఓట్లు వేయడానికి ఎక్కువ మంది రండి, ఇంట్లో కూర్చుని ఎన్నికల వేళ ఓటేయని వారు ప్రజాస్వామ్యం గురించి చెబితే బాగోందన్నదే పవన్ మార్క్ క్లాస్ అన్న మాట. సో ఇక మీదట మేము నోటాకే వేశామని ఎవరైనా అంటే పవనన్న క్లాస్ కచ్చితంగా గుర్తుకు రావాల్సిందే మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News