జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత నాయకుల తో వరుస సమావేశాలు నిర్వహించారు. యువకులు, వీర మహిళలు, కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడా రు. తెలంగాణలో రాజకీయ, సామాజిక పరిస్థితులు, ప్రజా సమస్యలను వారి నుంచి తెలుసుకున్నారు. ప్రజా పక్షాన ఉంటూ.. పార్టీ పక్షాన నిర్వర్తించాల్సిన బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు.
నాయకులు, కార్యకర్తలు పరస్పర అవగాహనతో, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని స్పష్టం చేశారు. ఎన్నికల సన్నద్ధతకు అవసరమైన రాజకీయ శిక్షణ శిబిరాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
అనంతరం విశాఖపట్నం జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జులతో భేటీ అయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, డివిజన్ స్థాయి సమావేశాలపై పవన్ స్పష్టత ఇచ్చారు.
ఈ సందర్భంగా పవన్ తన పార్టీ నాయకులతో మాట్లాడుతూ..ఎవరూ కూడా పొత్తులపై చర్చలు పెట్టొద్దని సూచించారు. ఒంటరిగానే పోటీ చేస్తున్నామని.. భావించి.. ఆ విధంగానే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించారు.
ప్రజలతోనే పొత్తులు ఉన్నాయని ఉంటాయని భావించి.. ఆదిశగానే అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఎవరూ కూడా పొత్తుల గురించి మాట్లాడుకోవద్దని చెప్పారు. సమయం వచ్చినప్పుడు తానే ప్రకటన చేస్తానని అన్నారు.
ఇక, టీడీపీతో కలిసి ముందుకు సాగాలా? వద్ద.. అనే విషయాన్ని కూడా తర్వాత చెబుతానన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు.. ప్రజల కష్టాలను ప్రధానంగా ప్రస్తావించాలని.. ఆయన పార్టీ నాయకులకు సూచించారు. గతంలోను ఇప్పుడు.. మనకు ప్రజలే ముఖ్యమని.. పవన్ చెప్పడం గమనార్హం.. వారితోనే పొత్తలు ఉంటాయని.. వారితోనే కలిసి నడవాలని.. అన్నారు. స్థాయి మరిచి ఎవరూ మీడియాముందు వ్యాఖ్యలు చేయొద్దని.. పవన్ సూచించారు.