ఏపీలో ఇపుడు ప్రజా సమస్యల మీద చర్చ సాగడం లేదు. అభివృద్ధి మీద అంతకంటే డిస్కషన్ లేదు. జనాలు ఏ రకమైన బాధలలో ఉన్నారు అన్నది కూడా ఎవరికీ పట్టడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా వైసీపీ పాలనా పరమైన వైఫల్యాల మీద పోరాటం చేసే సీన్ లో విపక్షం లేదు, ఆ విధంగా వారిని ఉండనిచ్చేలా అధికార పక్షమూ అసలు లేదు.
మరి ఏం జరుగుతోంది అంటే ఎపుడైనా పుడతారో లేదో తెలియని బిడ్డ పేరు కోసం అతి పెద్ద సమరం సాగుతోంది. ఈ రోజుకు తీసుకుంటే ఏపీలో నిక్షార్సుగా చెప్పుకోవడానికి రాజధాని అంటూ ఏదీ లేదు. అమరావతి రాజధాని ఉంది కదా అంటే దానికి ఈ రోజుకీ రూపూ లేదు షేపూ లేదు. టీడీపీ ఇంకా బాలసారె కూడా చేయకుండా గద్దె దిగిపోతే ఆ బిడ్డ ఆలనా పాలనా చూడకుండా వైసీపీ మరో ఇద్దరు బిడ్డలు అంటూ మూడు రాజధానుల ముచ్చటకు తెర తీసింది.
ఈ వ్యవహారం ఒక న్యాయ స్థానంలో కొట్టేశారు. సుప్రీం కోర్టులో దీని మీద స్టే కోసం సర్కార్ వెళ్ళింది. అక్కడ ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ రాజకీయ యుద్ధానికి మాత్రం ఎలాంటి అడ్డంకులు లేవు కాబట్టి అటు అధికార పక్షం సై అంటే ఇటు విపక్షం సై సై అంటూ కన్ను కొడుతోంది.
విశాఖ పాలనా రాజధాని కర్నూల్ న్యాయ రాజధాని అంటూ వైసీపీ విశాఖలో గర్జించింది. రాయలసీమలో ఇంకా ఏ రకమైన సౌండ్ చేస్తుందో ఏమో తెలియదు కానీ విశాఖలో మాత్రం రాజధాని అంటే రెడీ మేడ్ సిటీవే ఉండాలని వైసీపీ నేతలు, మంత్రులు బల్లగుద్దుతున్నారు. మరో వైపు చూస్తే రాజధాని అంటే అమరావతే తప్ప మరేమీ కాదు అని విపక్షం అంతా ఏకమై ఒక్క మాటే మాట్లాడుతోంది.
అయితే అందులో నుంచి చిత్రంగా జనసేన కాస్తా ముందుకు వచ్చింది. విశాఖ రాజధానికి జై అని జనసేన అంటోంది. ఇది నిజంగా ఆశ్చర్యకరమే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, కీలక నేత అయిన నాగబాబు విశాఖ రాజధాని అమ్మ మొగుడు లాంటి సిటీ అని ట్వీటేశారు. అంతే కాదు దాన్ని మీరు రాజధాని చేయడమేంటి అని వైసీపీ నేతల మీద ఫైర్ అయ్యారు.
చేస్తే గీస్తే విశాఖను దేశానికే రెండవ రాజధాని చేయాలి అంటూ కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు. విశాఖకు అంతటి పొటెన్షియాలిటీ ఉందని నాగబాబు చెప్పడం నిజంగా గ్రేటే కానీ విశాఖను దేశానికి రెండవ రాజధాని ఎలా చేస్తారో మాత్రం ఆయన చెప్పలేదు. అతి చిన్న రాష్ట్రంగా ఉన్న ఏపీకే విశాఖ రాజధానిగా విశాఖను టీడీపీ అప్పట్లో ఎంచుకోలేదు. అమరావతి అని కొత్త నగరం నిర్మాణానికి సాహసించింది.
ఇక దేశానికి రెండవ రాజదాని అని నాగబాబు ఇపుడు కొత్త తగువు తెచ్చేలా ఉన్నారా అన్న సెటైలు పడుతున్నాయి. హైదరాబాద్ ఈ దేశానికి రెండవ రాజధాని కావాలని టీయారెస్ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. సౌత్ నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించేలా హైదరాబాద్ ఉంటుందని చెబుతోంది. అది నిజంగా సత్యం. హైదరాబాద్ తో పోలిస్తే విశాఖ ఏపాటి అన్నది కూడా చూడాలి.
మరి నాగబాబు రాజకీయ మేధావిగా చెప్పారో లేక రాజకీయ నేతగా చెప్పారో తెలియదు కానీ విశాఖ జస్ట్ ఏపీలో మూడింట ఒక రాజధాని ఏంటి దేశంలోనే రెండవ క్యాపిటల్ అనేశారు. ఆ విధంగా విశాఖను పెంచేసి వైసీపీ నేతల డిమాండ్ ని దించేశారు. వీటి సంగతి పక్కన పెడితే జనసేన కూడా రాజధానిగా విశాఖ అంటోంది. బట్ వారి డిమాండ్ వేరు. వైసీపీ డిమాండ్ ని బై పాస్ చేయడానికో లేక విశాఖకు మీ కంటే మేమే గొప్ప హోదా ఇచ్చామని చెప్పుకోవడానికో తెలియదు కానీ జనసేన నోట విశాఖ రాజధాని మాట పలికింది. ఇక టీడీపీ వంతు ఇపుడు ఆ పార్టీ విశాఖను తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ క్యాపిటిల్ అని బిరుదిచ్చేయదు కదా అన్నదే చర్చ మరి.