జగన్ వెర్సస్ జనసేన అన్న విధంగా రాజకీయ పరిణామాలు ఉన్నాయి.కానీ జగన్ మాత్రం వీలున్నంత వరకూ బాలయ్యకు సాయం చేసే పంపారని ఎప్పటి నుంచో ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోందని పవన్ వర్గాలు సోషల్ మీడియాలో వివిధ పోస్టుల రూపంలో చెబుతున్నాయి. అంతేకాదు టీడీపీ,వైసీపీ మధ్య పైకి అయోధ్య లోపల సయోధ్య నడుస్తోందని కూడా ఆరోపణలు గుప్పిస్తోంది జనసేన. ఈ నేపథ్యంలో బాలయ్య పోరు నైతికమా లేకా జగన్ పోరు నైతికమా?
అఖండ సినిమా విషయమై జగన్ చాలా బాగా నడుచుకున్నారని జనసేన నిన్నటి నుంచి అదే పనిగా వైసీపీని ట్రోల్ చేస్తోంది.అంటే ఆ సినిమా నిర్మాత రవీందర్ రెడ్డికి పేర్నినాని సాయం చేశారన్న విషయం స్వయంగా ఆ మంత్రే వెల్లడి చేయడంతో జనసేన మరింత ఊగిపోతోంది.ఆగ్రహంతో తమకు అన్యాయం చేసి వారికి న్యాయం ఎలా చేస్తారని అంటోంది.
వాస్తవానికి ఐదో షో వేసేందుకు ఆ రోజు అఖండ సినిమా విషయమై పేర్ని నాని తో సహా ఏపీ ప్రభుత్వ పెద్దలు బాలయ్యకు సాయంచేసిన విషయం ఇప్పుడు వెలుగు చూడడం,బాలయ్య తన సినిమా విషయమై సీఎం జగన్ తో మాట్లాడాలనుకోవడం వంటి వివరాలు వెలుగు చూడడంతో తమను ఈ విధంగా అవమానకర రీతిలో చూడడం,వారిని మాత్రం ఆఫీసుకు కూడా రానివ్వకుండా గౌరవనీయంగా చూడడం ఎంత మాత్రం తగదని జనసేన అంటోంది.
ఈ నేపథ్యంలో ఆ రోజు మంత్రి నడుచుకున్న తీరు ఈ రోజు మంత్రి నడుచుకున్న తీరు ఈ రెండూ ఏ మాత్రం సంబంధం లేకుండా ఉన్నాయని వేదన చెందుతోంది.
ఈ నేపథ్యంలో జనసేనకూ జగన్ సేనకూ మధ్య యుద్ధమే జరుగుతోంది.ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అన్నది అటుంచితే నిన్నటి వేళ టికెట్ కౌంటర్ల దగ్గర ఓ గ్రేడ్ 1 ఆఫీసర్ స్థాయి వ్యక్తులు నిల్చొని, తమ స్థాయి మరిచి ప్రవర్తించడం సబబు కాదని అంటున్నారు పవన్ అభిమానులు.
రాజకీయంగా టీడీపీ,వైసీపీ హాయిగానే వాటాలేసుకుని నడుచుకుంటున్నాయని,ఇందుకు బాలయ్య అఖండ సినిమానే పెద్ద ఉదాహరణ అని కూడా అంటున్నారు.ఈ వివాదం లో పేర్ని నాని కూడా ఉన్నారు.ఈ వివాదంలో కొడాలి నాని కూడా ఉన్నారు.
ఎందుకంటే నిన్నటి వేళ వీళ్లిద్దరూ ప్రజా నిరసనలను ఎదుర్కొన్నవారే కనుక! ఈ నేపథ్యంలో జగన్ సాయం పొంది కూడా ఆ విషయం బాలయ్య చెప్పకపోవడం ఓ వివాదం అయితే, తమను మాత్రం విభిన్నంగా అత్యంత అవమానకర రీతిలో ఏపీ అధికారులు చూడడం మరో వివాదానికి తావిచ్చిన పరిణామం.వీటిపై పేర్ని నాని ఏ విధంగా స్పందిస్తారో ?