చైనాను వీడి వస్తే.. జపాన్ ప్రధాని భారీ ఆఫర్

Update: 2020-04-10 15:00 GMT
కరోనా వైరస్ ను ప్రపంచానికి అంటించిన చైనాకు మొదటి సెగ తగిలింది. చైనాకు మొట్టమొదటి షాక్ ను దాని పక్కనే ఉండే జపాన్ దేశం ఇచ్చింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జపాన్ దేశం అంటువ్యాధులతో అతలాకుతలంగా ఉన్న చైనా నుంచి తమ కంపెనీలను వైదొలగాలని పిలుపునిచ్చింది. జపాన్ ప్రధాని షింజో అబే తాజాగా 2.2 బిలియన్ అమెరికన్ డాలర్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని తమ కంపెనీలకు ఇచ్చారు. ఇది జపాన్ ఆర్థిక ఉత్పత్తిలో 20శాతానికి సమానం కావడం విశేషం.

జపాన్ తయారీ దారులు మొత్తం చైనా నుంచి ఉత్పత్తి చేయడం ఆపేసి దేశానికి రావాలని.. ఇక్కడ ఉత్పత్తి చేయాలని.. అందుకోసం ఏకంగా భారీ ప్యాకేజీని జపాన్ ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కరోనాతో దెబ్బతిన్న జపాన్ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి జపాన్ ప్రధాని ఇలా చైనాలో నెలకొల్పిన తమ కంపెనీలను దేశానికి రావాలని.. ఇక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

కరోనా వైరస్ కారణంగా చైనాలో అంటు వ్యాధి తీవ్రంగా ప్రబలి కంపెనీలు మూతపడ్డాయి. చాలా మంది జపనీయులు కూడా చనిపోయారు. దీంతో నష్టాలు ఏర్పడి ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో జపాన్ ఈ తీవ్రమైన చర్య తీసుకుంది. తమ కంపెనీలను తమ దేశానికి రప్పిస్తోంది. ఈ చర్యతో చైనాలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్నారు.

గతంలో చైనాకు జపాన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. కానీ ఫిబ్రవరిలో కరోనా వైరస్ చైనాలో వ్యాపించడంతో కర్మాగారాలను మూసివేశారు. దీంతో చైనా నుంచి దిగుమతులు జపాన్ దేశానికి సగానికి పడిపోయాయి. దీంతో జపనీయులు బాగా దెబ్బతిన్నారు. ఆకలిదప్పులు ఎదుర్కొన్నారు. చైనా నుంచి 148 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను జపాన్ కు ఎగుమతి అవుతాయి. అవన్నీ ఆగిపోవడంతో జపాన్ చాలా తీవ్ర ఇబ్బందులు పడింది.

ఇతర దేశాలు చేసినట్టు చైనాపై ఆరోపించకుండా తమ కంపెనీలను వెనక్కి రప్పించడం ద్వారా జపాన్  చైనాకు  గట్టి  షాక్ ఇచ్చినట్టైంది. ఇది మరిన్ని దేశాలకు ఊతంగా మారింది. ఇదే జరిగితే చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది.
Tags:    

Similar News