భూకంపం.. జపాన్ ను వణికించింది..

Update: 2018-09-06 11:43 GMT
వరుస భూకంపాలతో కునరిల్లే జపాన్ మరోసారి వణికింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 3 గంటలకు జపాన్ లోని హోక్కైడో ద్వీపాన్ని భూకంపం చిగురుటాకులా వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7గా నమోదైంది. దీని ప్రభావంతో ఈశాన్య జపాన్ లో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

కాగా ఈ భారీ భుకంపంతో ప్రాణనష్టంపై సమాచారం అందలేదు. అలాగే భూగర్భంలో భూకంపం రావడంతో సముద్రంలో సునామీ వచ్చే అవకాశాలు లేవని హెచ్చరికలను  జారీ చేయలేదు. జేబీ టైఫూన్  జపాన్ ను అతలాకుతలం చేసిన కొన్ని గంటల్లోనే భారీ భుకంపం వణికించడం జపాన్ వాసులను నివ్వెరపరిచింది.

కాగా తుఫాన్ సందర్భంగా గంటలకు 216 కి.మీల వేగంతో గాలులు వీచాయి. ఈ ధాటికి జపాన్ లోని చిన్న కార్లన్నీ కొట్టుకొని వచ్చి ఓ బిల్డింగ్ వద్దకు కుప్పలుగా చేరాయి. పశ్చిమ జపాన్ లోని కోబె నగరంలో ఈ కార్ల కుప్ప ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tags:    

Similar News