ఒక సామాన్యుడ్ని ఒక రాజకుమారి ప్రేమించటం.. పెళ్లి చేసుకోవటం చాలా వరకు జానపద కథల్లో.. ఫిక్షన్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా రియల్ లైఫ్ లో అలాంటి అరుదైన ఉదంతం జపాన్ లో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తన ప్రేమ కోసం.. ఆస్తిని.. హోదాను వదులుకోవటమే కాదు.. నిబంధనల ప్రకారం ఇస్తామని చెప్పిన రూ.10 కోట్లను వదిలేసుకున్న రాకుమారి.. ఎట్టకేలకు తాను కోరుకున్న వాడిని పెళ్లాడే సమయం వచ్చేసింది.
జపాన్ రాకుమారి మాకో. అక్టోబరు 23 నాటికి ఆమెకు 30 ఏళ్లు నిండుతాయి. తన కంటే కొద్ది నెలలు చిన్నవాడైన తన సహ న్యాయవాద విద్యార్థి కొమురోను ప్రేమించిన ఆమె.. అతడ్ని పెళ్లి చేసుకునేందుకు భారీ త్యాగాలకే సిద్ధమైంది. వీరి ప్రేమకథ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ కావటమే కాదు.. రాజకుమారి మంచి మనసుకు ఫిదా కాని వారే ఉండరు. జపాన్ నిబంధనల ప్రకారం వీరి పెళ్లికి తాజాగా డేట్ ఫిక్సు అయ్యింది.
కాబోయే అత్తింటివారితో ఉన్న ఆర్థిక వివాదం కారణంగా ఈ పెళ్లికి ప్రజల ఆమోదం లేదని చెబుతారు. ఈ కారణంతోనే వివాహ విందుతో పాటు.. ఇతర లాంఛనాలు ఏమీ కూడా ఉండవని చెబుతున్నారు. అక్టోబరు 26న రాజకుమారి మాకో వివాహం జరుగుతుందని.. అనంతరం కొత్త దంపతులు మీడియాతో మాట్లాడతారని.. ఆ తర్వాత న్యూయార్కుకు వెళ్లిపోయి.. అక్కడే కాపురం పెట్టనున్నట్లు చెబుతున్నారు.
టోక్యో ఇంటర్నేషనల్ క్రిస్టియన్ వర్సిటీలో చదువుకునే వేళలో.. ఈ ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. 2017లో వీరు పెళ్లి చేసుకుంటామని ప్రకటించినా.. ఆర్థిక వివాదాల కారణంగా వీరి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. జపాన్ రాజకుటుంబానికి చెందిన యువతి సామాన్య యువకుడిని పెళ్లాడితే నిబంధనల ప్రకారం రాకుమారి తన హోదాను వదులుకోవాల్సి ఉంటుంది. దీనికి ప్రతిగా రాజ ప్రాసాదం రాకుమారికి రూ.10 కోట్ల మొత్తాన్ని ఇస్తారు. అయితే.. తనకు ఆ మొత్తం అక్కర్లేదని.. తనకు నచ్చినోడితో పెళ్లి చాలన్న ఆమె నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు అందుకునేలా చేస్తే.. జపాన్ లో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం ఉందన్న మాట వినిపిస్తుంటుంది.