ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్లపాటు జైలుక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో తమిళనాడులో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అసలు ఈ కేసేంటి... శశికళకు ఈ కేసుకు సంబంధమేమిటన్నది పరిశీలిస్తే..
1991 నుంచి 1996 మధ్య తొలిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత.. ఆదాయానికి మించి రూ.66.65 కోట్ల విలువైన ఆస్తులను పోగేసుకున్నారని 1996లో అప్పటి జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు దాఖలైంది. ఈ కేసులో జయలలితతో పాటు శశికళ - జె.ఇళవరసి - వి.ఎన్.సుధాకరన్ లను నిందితులుగా పేర్కొంటూ విచారణ మొదలైంది. దీనిపై తొలుత మద్రాస్ హైకోర్టులో విచారణ సాగింది.
2001లో అన్నాడీఎంకే మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు. దీనివల్ల ఈ కేసు విచారణ నిష్పాక్షికంగా సాగదంటూ డీఎంకే సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. 2003 నవంబర్ లో ఈ కేసు విచారణను కర్ణాటకకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చింది. ప్రత్యేక కోర్టు విచారణ సాగించింది. 2014 సెప్టెంబర్ 27న తీర్పు వెలువరించింది. జయ - శశి సహా నలుగుర్ని నిందితులుగా ప్రకటించింది. నాలుగేళ్ల చొప్పున కారాగార శిక్ష - కోట్ల రూపాయల జరిమానాను విధించింది. దీంతో జయ తన పదవికి రాజీనామా చేసి - కొంతకాలం బెంగళూరులోని జైల్లో ఉండాల్సి వచ్చింది.
ప్రత్యేక కోర్టు తీర్పును నిందితులు కర్ణాటక హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన హైకోర్టు 2015 మే 11న దిగువ కోర్టు తీర్పును కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో అపీలు చేసింది. దీనిపై గత ఏడాది ఫిబ్రవరి 23న వాదనలు మొదలయ్యాయి. విచారణ పూర్తిచేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ - జస్టిస్ అమితవ రాయ్ లతో కూడిన ధర్మాసనం.. గత ఏడాది జూన్ 7న తీర్పును వాయిదా వేసింది. తాజాగా తీర్పు ఇచ్చింది.
శశికళపై ఇంకా ఏఏ కేసులున్నాయి..
* విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం (ఫెరా) ఉల్లంఘన కేసులను కూడా శశికళ ఎదుర్కొంటున్నారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించారంటూ 1995 - 1996లో శశికళపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మూడు కేసులు నమోదు చేసింది. ఈ కేసుల నుంచి విముక్తి కల్పించాలంటూ ఇటీవల ఆమె పెట్టుకున్న పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది.
* మలేసియాలో ఉన్న ఒక వ్యక్తి ద్వారా అక్రమంగా విదేశీ మారకద్రవ్యాన్ని సేకరించారంటూ శశికళపై మరో కేసు ఉంది.
అక్రమాస్తుల కేసులో ఎప్పుడేమైంది...
* డీఎంకే 1996లో అధికారంలోకి రాగానే ఈ కేసు విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది.
* డిసెంబర్ 7, 1996: అన్నాడీఎంకే నేత జయలలిత అరెస్ట్.
* ఏప్రిల్ 17, 1997: జయలలితతో పాటు శశికళ - ఇళవరసి - సుధాకరన్ లపై 41 కేసులు - విచారణకు మూడు కోర్టుల ఏర్పాటు.
* జూన్ 4, 1997: ఐపీసీలోని సెక్షన్ 120-బీ, అవినీతి నిరోధక చట్టం 1988లోని 13(2) రెడ్ విత్ 13(1)(ఇ) సెక్షన్ల కింద కేసులు. చార్జ్ షీట్ దాఖలు.
* అక్టోబర్ 1, 1997: కేసును కొట్టివేయాలంటూ, మూడు పిటిషన్లను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు.
* ఫిబ్రవరి 5, 1999: ప్రత్యేక కోర్టులను రద్దు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్... ఆ ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు.
* మే, 2001: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే విజయం... సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జయలలిత.
* సెప్టెంబర్ 21, 2001: సీఎం పదవి నుంచి తప్పుకున్న జయలలిత... సీఎంగా పన్నీర్ సెల్వం.
* నవంబర్ 2001: జయలలితను నిర్దోషిగా తేల్చిన హైకోర్టు.
* మార్చి 2, 2002: అండిపట్టి అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయంతో మరోసారి పీఠమెక్కిన జయలలిత.
* నవంబర్ 2, 2002: అక్రమాస్తుల కేసులో విచారణ పునఃప్రారంభం.
* ఫిబ్రవరి 5, 2003: కేసును మరో రాష్ట్రానికి తరలించాలని డీఎంకే నేత అన్బళగన్ పిటిషన్.
* నవంబర్ 18, 2003: కేసును కర్ణాటకకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు.
* అక్టోబర్, నవంబర్ 2011: ప్రత్యేక కోర్టుకు పలుమార్లు హాజరై 1339 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన జయ.
* ఆగస్టు 14, 2012: స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కొనసాగలేనని రాజీనామా చేసిన బీవీ ఆచార్య.
* ఫిబ్రవరి 2, 2013: భవానీ సింగ్ కు ప్రాసిక్యూటర్ బాధ్యతలు.
* ఆగస్టు 26, 2013: భవానీసింగ్ ను తప్పించిన కర్ణాటక ప్రభుత్వం.
* సెప్టెంబర్ 30, 2013: భవానీసింగ్ ను తప్పించడాన్ని తప్పుపట్టిన సుప్రీం... ఆదేశాలు రద్దు.
* ఆగస్టు 28, 2014: విచారణ పూర్తి... తీర్పు సెప్టెంబర్ 20కి వాయిదా.
* సెప్టెంబర్ 16, 2014: తీర్పును సెప్టెంబర్ 27కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన ప్రత్యేక కోర్టు.
* సెప్టెంబర్ 27, 2014: జయలలితను దోషిగా తేల్చిన కోర్టు, నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరిమానా.
* మే 11, 2015: కర్ణాటక హైకోర్టులో జయలలిత పిటిషన్... నిర్దోషిగా ప్రకటిస్తూ నిర్ణయం.
* జూలై, 2015: తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక ప్రభుత్వం.
* డిసెంబర్ 5, 2016: రెండున్నర నెలల పాటు ఆసుపత్రిలో ఉన్న జయలలిత మరణం.
* ఫిబ్రవరి 14, 2016: నిందితులంతా దోషులేనని ప్రకటించిన సుప్రీంకోర్టు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/