1989 మార్చి 25 వ తేది. తమిళనాడు శాసనసభ. ప్రతిపక్ష నేత - అన్నా డీఎంకె అధినేత్రి - పురచ్చితలైవి ఆలియాస్ అమ్మ శాసనసభలో అధికార డీఎంకె అవినీతిని ఎండగడుతోంది. దీనిని జీర్ణించుకోలేని డీఎంకె సభ్యులు ఆమె మీద వ్యక్తిగత ఆరోపణలు చేశారు. అంతటితో ఊరుకోకుండా దాడి చేసి చీర పట్టి లాగారు. దీంతో ఖంగుతిన్న జయలలిత కన్నీటి పర్యంతమయింది. ఈ సభలోకి మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాననని శపథం చేసిన జయలలిత 24-06-1991 మొదటి సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాకే సభలో అడుగు పెట్టింది.
కట్ చేస్తే ఆ మధ్య కాలంలోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆంధ్రుల ఆరాధ్య నటుడు - అన్న ఎన్టీఆర్ సభలో మాట్లాడుతుండగా ఆయన మీద తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఎన్టీఆర్ కండువా తీసి స్పీకర్ పోడియం వద్ద ఉంచి తిరిగి ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని బయటకు వెళ్లిపోయాడు. అన్నట్లుగానే ముఖ్యమంత్రిగా సభలో అడుగు పెట్టాడు. ఈ అరుదయిన ఫీట్ ఈ దేశంలో ఈ ఇద్దరు నేతలదే అని చెప్పాలి.