ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రకు పెట్టుబడులు తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు.. దేశీయంగా దిగ్గజ సంస్థలనూ మా రాష్ట్రంలో పరిశ్రమలు - సంస్థలు పెట్టుకోండండటూ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. మరోవైపు ప్రత్యేక హోదా కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక హోదా కనుక వస్తే పన్ను రాయితీలు - ఇతర ప్రోత్సాహాల వల్ల సంస్థలు - పరిశ్రమలు నవ్యాంధ్రకు తరలివస్తాయి. ఇక్కడ రోడ్డు - రైల్వే కనెక్టివిటీతోపాటు భారీ పోర్టులు కూడా ఉండడంతో పరిశ్రమలు పరుగెత్తుకుంటూ వస్తాయి. ఈ క్రమంలో చంద్రబాబు స్పీడు చూసి పొరుగు రాష్ట్రాలు కాస్త కలవరపడుతున్నాయి. ఆ కలవరపాటుతో చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా పొరుగు రాష్ర్టం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చంద్రబాబుపై సెటైర్లు వేశారు. అక్కడి అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ పెట్టుబడుల విషయమై చంద్రబాబుపై విమర్శలు చేశారు.
పెట్టుబడులు రాబట్టేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై తమిళనాడు సీఎం జయలలిత అసెంబ్లీలో సెటైర్లు వేశారు. ఏపీ సీఎం చంద్రబాబు - కర్నాటక సీఎం సిద్ధరామయ్యలు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రచారం చేసుకుంటున్నారని జయ అన్నారు. ఇందుకోసం ఇద్దరు సీఎంలు ఉచితంగా భూములు - ఇతర ప్రయోజనాలు కూడా ఇస్తామంటూ హోరెత్తిస్తున్నారని చెప్పారు. కానీ వారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా పెట్టుబడులు మాత్రం తమిళనాడుకే వస్తున్నాయని జయలలిత వివరించారు.
ఏ రాష్ట్రంలోనైనా వ్యాపారాలు లాభసాటిగా సాగాలంటే శాంతిభద్రతలు సక్రమంగా ఉండాలని... ఆ పరిస్థితి ఒక్క తమిళనాడులో మాత్రమే ఉందన్నారు. విద్యుత్ సరఫరా కూడా నిరంతరాయంగా తమిళనాడులో ఉంటోందన్నారు. ఏపీ - కర్ణాటక రాష్ట్రాలే తమిళనాడు నుంచి విద్యుత్ ను కొనుక్కోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయని జయలలిత వివరించారు. మొత్తం మీద ప్రచారం చేసుకోవడం ద్వారా పెట్టుబడులు రావన్నట్లుగా ఆమె మాట్లాడారు. అంతేకాదు.. మా దగ్గర కరెంటు కొనుక్కునేవాళ్లు మాకంటే ఎక్కువ పరిశ్రమలు ఎలా పెడతారన్నట్లుగా అన్నారు. చూడబోతే... నవ్యాంధ్రలో పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పడితే తమిళనాడు మనకు కరెంటు విక్రయించడం మానేసినా మానేస్తుందేమో. అయినా.. సోలార్ పవర్ అందుబాటు పెరగడం.. ఇతర ప్రాజెక్టులు ఉత్పత్తి దశకు రావడంతో విద్యుత్ గురించి పెద్దగా బెంగపడే పరిస్థితి లేదు.