అప్పుడెప్పుడో అమ్మ వీలునామా రాసేశారా?

Update: 2016-12-14 09:08 GMT
అమ్మకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. వందలాది కోట్ల రూపాయిలకు అసలుసిసలు వారసులు ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె మరణం ఊహించని విధంగా చోటు చేసుకోవటం.. ఆమె ఆస్తులకు వారసులు ఎవరన్నది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. సాధారణంగా అత్యున్నతస్థానాల్లో ఉన్న వారు.. సంపన్నులు తమకు సంబంధించిన ఆస్తులకు వారసుల్ని ముందుగా సిద్ధం చేస్తుంటారని చెబుతారు. కానీ.. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన వారసులు ఎవరన్నది ఇప్పుడు పెద్దప్రశ్నగా మారింది.

ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. విశ్వసనీయ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం.. అమ్మ ఎప్పుడో తన వారసులకు తన ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేస్తూ వీలునామా రాసినట్లుగా చెబుతున్నారు. ఆమెకు చెందిన ఆస్తిపాస్తులు పలు చోట్ల ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని జేజే గార్డెన్స్ చిరునామాతో పాటు..రెండుట్రస్టులకు కూడా రిజిష్టర్ చేసినట్లు చెబుతున్నారు. అయితే.. ఆమె రాసిన వీలునామా ఎవరిపేరు మీద రాశారన్నది తెలీయటం లేదని అధికారులు చెబుతున్నారు.

రిజిస్ట్రేషన్ శాఖ రూల్స్ ప్రకారం బుక్ 3లో నమోదైన వీలునామా సమాచారం.. ఆ ఆస్తులకు వారసులైన వారికి మినహా ఇతరులకు తెలిసే వీలు లేకపోవటంతో.. అమ్మ ఆస్తులకు అసలుసిసలు లీగల్ హెయిర్ ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తన ఆస్తులకు సంబంధించి వారసులను పేర్కొంటూ 2000 జులై 14న అమ్మ రిజిస్ట్రేషన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రక్రియ మొత్తం.. హైదరాబాద్ నగర శివారులోని జేజే గార్డెన్ లో జరిగినట్లుగా చెబుతున్నారు.

పురట్చి తలైవి బెస్ట్ చారిటబుల్ ట్రస్ట్.. నమద్ ఎంజీఆర్ బెస్ట్ చారిటబుల్ ట్రస్ ల పేరిట రిజిస్ట్రేషన్ చేయగా.. ఆ ట్రస్ట్ నిర్వాహకురాలిగా జయలలిత తన పేరుతో పాటు.. తన నెచ్చెలి శశికళ.. దినకరన్.. భాస్కరన్.. భువనేశ్వరి పేర్లను చేర్చినట్లుగా తెలుస్తోంది. ఈ రిజిస్ట్రేషన్ కు సంబంధించి 2001లో కొద్దిపాటి మార్పులు చేసినట్లు సమాచారం. ఈ మార్పులకు సంబంధించిన ఐటీ శాఖకు సమాచారం అందిచనున్నట్లుగా పేర్కొన్నట్లు చెబుతున్నారు. మరి.. అమ్మ రాసిన వీలునామా గుట్టు ఎప్పటికి బయటకువస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News