అమ్మ ఆగ్ర‌హం; ప‌రువు న‌ష్టం దావా వేశారు

Update: 2015-07-17 08:50 GMT
అమ్మ‌కు కోపం వ‌చ్చింది. త‌న ఆరోగ్యం బాగోలేద‌ని.. సీరియ‌స్ గా ఉందంటూ క‌థ‌నం రాసిన మీడియా సంస్థ‌కు నోటీసులు పంపారు. తాను స‌ల‌క్ష‌ణంగా ఉంటే.. తాను అనారోగ్యంగా ఉన్నానంటూ రాసిన క‌థ‌నంపై ప‌రువున‌ష్టం కేసు వేశారు. మ‌రి.. ఇంత‌లా అమ్మ‌కు అగ్ర‌హం రావ‌టానికి కార‌ణ‌మేమిట‌న్న విష‌యంలోకి వెళితే..
ఈ మ‌ధ్య‌కాలంలో కొద్ది రోజులు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత ఇంట్లో నుంచి రాలేదు. అధికారిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న‌ది లేదు. ఉన్న‌ట్లుండి ఎందుక‌లా జ‌రిగింద‌న్న దాని మీద స‌మాచారం లేదు. ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న వ్య‌క్తి నిత్యం న‌లుగురి మ‌ధ్య క‌నిపించే వ్య‌క్తి.. అక‌స్మాత్తుగా ఇంట్లో నుంచి రాక‌పోవ‌టంతో ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

దీనిపై న‌క్కీర‌న్ ప‌త్రిక ఒక క‌థ‌నం రాసింది. గార్డెన్ రిపోర్ట్ పేరిట ప్ర‌చురిత‌మైన ఈ క‌థ‌నంలో అమ్మ తీవ్ర అనారోగ్యంతో ఉన్న‌ట్లు.. ఆమెకు డ‌యాల‌సిస్ చేస్తున్న‌ట్లు.. ఆమె కాలేయం తీవ్రంగా దెబ్బ తింద‌ని.. ఏ క్ష‌ణంలో అయినా ఆప‌రేష‌న్ చేయాల్సి వ‌స్తుందంటూ క‌థ‌నం రాసింది. ఈ క‌థ‌నం త‌మిళ‌నాడుతో పాటు.. ద‌క్షిణాది రాష్ట్రాల్లో పెను సంచ‌ల‌నం సృష్టించింది. ప‌లువురు అమ్మ ఆరోగ్యంపై మాట్లాడుకునే ప‌రిస్థితి.

అప్ప‌టికి పెద్ద‌గా స్పందించ‌ని అమ్మ‌.. తాను బాగున్న‌ట్లుగా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయ‌లేదు. ఇదిలా ఉంటే.. ఈ క‌థ‌నానికి తోడుగా.. కొన‌సాగింపుగా మ‌రికొన్ని త‌మిళ మీడియాసంస్థ‌లు.. జ‌య‌ల‌లిత‌కు సింగ‌పూర్‌లో శ‌స్త్ర‌చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారంటూ వార్త‌లు వ‌చ్చేశాయి. దీంతో అస‌లు అమ్మ‌కొచ్చిన ఆరోగ్య స‌మ‌స్య ఏమిట‌న్న‌ది ఒక ప్ర‌శ్న‌గా మార‌టంతో పాటు.. అదెంత తీవ్ర‌మైన‌ద‌న్న చ‌ర్చ మొద‌లైంది.

ఇదిలా ఉంటే.. అదే స‌మ‌యంలో అమ్మ సైలెంట్ గా ఒక కార్య‌క్ర‌మానికి హాజ‌రై.. తాను నిక్షేపంగా ఉన్న‌ట్లుగా చెప్ప‌క‌నే చెప్పేశారు. దీంతో.. అమ్మ అనారోగ్యం మీద జ‌రిగిన చ‌ర్చ ప‌క్క‌కు వెళ్లింది. తాజాగా.. అమ్మ.. త‌న ఆరోగ్య ప‌రిస్థితిపై క‌థ‌నం ప్ర‌చురించిన న‌క్కీర‌న్ ప‌త్రిక‌కు ప‌రువు న‌ష్టం కేసు పెడ‌తానంటూ నోటీసులు పంపారు.
త‌న ఆరోగ్యంపై త‌ప్పుడు క‌థ‌నాలు రాసినందుకు.. త‌న ఇమేజ్ డ్యామేజ్ అయ్యింద‌ని.. త‌న ప‌రువుకు.. మ‌ర్యాద‌కు భంగం వాటిల్లిందంటూ ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రి.. దీనికి న‌క్కీర‌న్ ఎలా రియాక్ట్ అవుతుందో..?
Tags:    

Similar News