ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో సీఎం జగన్ మాట్లాడుతూ.. అనేక అంశాలను ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహ రించడం వల్లే..ప్రాజెక్టు పనులు పూర్తి కావడం లేదని విమర్శించారు. అంతేకాదు.. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును రాష్ట్రం ఎందుకు భుజాలకు ఎత్తుకోవాల్సిన అవసరం వచ్చిందని ప్రశ్నించారు.
ఈ క్రమంలో.. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు వద్ద జరిగిన కొన్ని ఘటనలను అసెంబ్లీలో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా.. జగన్ మాజీ సీఎం చంద్రబాబును ఆటపట్టించారు.. ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పాలనలో స్పిల్‌వే కాంక్రీట్ శంకుస్థాపన, ఐకానిక్ బ్రిడ్జ్ అండ్ కాపర్ డ్యామ్ పనుల పేరిట మరో శంకుస్థాపన, పునాది అయిపోయిందని ఇంకో శంకుస్థాపన, స్పిల్‌వేలో గేట్లకు సంబంధించిన పనులకు సంబంధించిన ఓ శంకుస్థాపన..ఇలా అవసరం లేని శంకుస్థాపనలతో కోట్ల ప్రజాధనం వృధా అయ్యిందని సీఎం జగన్ గుర్తు చేశారు.
గేట్లకు సంబంధించిన.. స్పిల్‌వేలో గ్యాలరీ వాక్ అంటూ కుటుంబ సభ్యులతో ఫ్యామిలీటూర్ చేశారని, త ద్వారా పొలవరం పనులు పూర్తయ్యాయనే భ్రమను జనాల్లో కలిగించే ప్రయత్నం చేశారన్నారు.
ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో.. రూ.100 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బస్సుల్లో జనాలను పొలవరం తరలించారని, ‘జయము జయము చంద్రన్న’ పాటతో ప్రత్యేకంగా భజన సైతం చేయించుకున్నారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు.
ఆ సమయంలో జయము జయము చంద్రన్న పాటను సభలోనే ప్లే చేశారు. దీంతో .. సభ మొత్తం నవ్వులు పూశాయి. కమీషన్ల కోసం కక్కుర్తి పడే ప్రాజెక్టును చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారని, పైగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన గొంతు నొక్కారని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. తమ పాలనలో పొలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మెజార్టీ పనులు పూర్తి చేసినట్లు.. పూర్తి వివరాలను సభకు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలకు గట్టిగా బుద్ధి చెప్పారని, ఇప్పుడు చేస్తున్న కుట్రలకు వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనూ బాబుకు ఓటమి తప్పదని జగన్ జోస్యం చెప్పారు.