జయంత్ చల్లాకు అమెరికాలో కీలక పదవి

Update: 2020-07-04 16:00 GMT
అమెరికాలో మరో తెలుగు ఎన్ఆర్ఐకి కీలక పదవి దక్కింది. భారత సంతతిలో ప్రముఖుడు, అమెరికా తెలుగు సంఘం (ఆటా) లో ముఖ్యుడు అయిన జయంత్ చల్లాను వర్జీనియాలోని స్మాల్ బిజినెస్ కమీషన్ కు సభ్యుడిగా నియమిస్తూ వర్జీనియా గవర్నర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

స్మాల్ బిజినెస్ కమీషన్ వర్జీనియా రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాలకు సంబంధించిన సమస్యలపై అధ్యయనం చేస్తుంది. ఈ క్రమంలోనే ఆ అధ్యయనం చేయడంతోపాటు ప్రభుత్వానికి సిఫారసులు చేసి అందించడం జయంత్ చల్లా బాధ్యత.

1988 నుంచి వర్జీనియాలో జయంత్ చల్లా ఉంటున్నారు. జర్మనీ, క్యూబాలో మిలటరీ ఫ్యామిలీ హౌసింగ్ ప్రాజెక్టుల్లో స్టాఫ్ ఇంజినీర్ గా జయంత్ జీవితం ప్రారంభమైంది. ప్రస్తుతం వియన్నాలో నివసిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ కంపెనీల్లో 30ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. ప్రస్తుతం చల్లా ఏస్ ఇన్ఫో సొల్యూషన్స్ ప్రెసిడెంట్ . తనను కమిషన్ సభ్యుడిగా నియమించడంపై వర్జీనియా గవర్నర్ కు జయంత్ ధన్యవాదాలు తెలిపారు. వర్జీనియాలోని 80వేల చిన్నా వ్యాపారాల సమస్యలపై పనిచేస్తానని తెలిపారు.


Tags:    

Similar News