జగన్ దెబ్బకు ఇక వ్యవసాయం చేసుకుంటానంటున్న జేసీ

Update: 2020-06-17 13:30 GMT
తన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి, అతడి కుమారుడు అస్మిత్ రెడ్డిని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో వేయడంపై జేసీ దివాకర్ రెడ్డి అసహాయత వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ తనను లక్ష్యంగా చేసుకున్నాడని.. తన వ్యాపారాలు దెబ్బతీశాడని మండిపడ్డారు.

కడప జిల్లా వల్లూరు మండలం మాచిరెడ్డిపల్లికి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి జగన్ సర్కార్ ఏం చేసినా తాను భయపడనని స్పష్టం చేశారు. తన వ్యాపారాలన్నీ జగన్ దెబ్బతీశాడని.. ఇక వ్యవసాయం చేసుకునైనా బతుకుతాను అని జేసీ అన్నారు.

కాగా జేసీ దివాకర్ రెడ్డిపై తాజాగా మరో అపవాదు తెరపైకి వచ్చింది. తన భవనాన్ని జేసీ బ్రదర్స్ ఆక్రమించారంటూ మల్లిఖార్జున్ అనే వ్యక్తి తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురంలోని జేసీ ట్రావెల్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. 2009 నుంచి తన భవనంలో జేసీ ట్రావెల్స్ పెట్టి తనకు అద్దెచెల్లించడం లేదని మల్లిఖార్జున్ ఆరోపించారు. తమ జోలికి వస్తే చంపుతామని అంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించారని ఆరోపించారు. తన భవనం నుంచి జేసీ ట్రావెల్స్ కార్యాలయాన్ని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇలా వైసీపీ ప్రభుత్వం జేసీ ఫ్యామిలీపై చర్యలకు దిగిన వారి బాధితులంతా బయటకు వచ్చి వారి అక్రమాలపై రోడ్డుక్కుతుండడం చర్చనీయాంశంగా మారింది. వరుస వివాదాలు జేసీ సోదరులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Tags:    

Similar News