జగన్ అంటే రాహుల్ కి ఇష్టం లేదట

Update: 2016-02-29 05:51 GMT
ఏపీ యువ నేత - వైసీపీ అధ్యక్షుడు జగన్ అంటే కాంగ్రెస్ పార్టీ యువ నేత రాహుల్ కు ఎలాంటి అభిప్రాయం ఉండొచ్చు... ? మన అంచనాలు ఎలా ఉన్నా కానీ, టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి మాత్రం రాహుల్ దృష్టిలో జగన్ స్థానమేంటనేది చెప్పుకొచ్చారు. విజయవాడలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  ఏపీలో విపక్ష నేత జగన్ అంటే రాహుల్ గాంధీకి ఏమాత్రం సదభిప్రాయం లేదని జేసీ చెప్పుకొచ్చారు. అయితే... ఇటీవల ఆయన ఢిల్లీలో జగన్‌ తో కలిసి ఫొటోలకు ఫోజులివ్వడంపై చంద్రబాబు ఏమైనా అనుకుంటారని అనుకున్నారో ఏమో కానీ ఇలా వివరణ ఇచ్చినట్లుగా మాట్లాడారు. అసలు ఆ రోజు ఏమేం జరిగాయి... ఎవరెవరిని కలిశాను వంటివన్నీ ముచ్చటించారు.
   
తాను ఢిల్లీలో జగన్‌ కు హాయ్ చెప్పి ఫొటోలు మాత్రమే దిగానని.. రాజకీయ చర్చలేమీ జరగలేదని జేసీ చెప్పారు. వైసీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ ను కలిసిన రోజే పార్లమెంట్ ఇన్నర్ లాబీల్లో సోనియాను కలిశానని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించినందుకు ఆమెలో కాసింతైన పశ్చాత్తాపం కనిపించలేదన్నారు. విభజన వల్ల పార్టీతో పాటు రాష్ట్రం, తాము అందరం ముగినిపోయామని సోనియాకు చెప్పానని కూడా జేసీ చెబుతున్నారు. అసలు ఏపీలో కాంగ్రెస్‌కు మనుగడే లేదని సోనియాతో చెప్పానని.. సోనియాను కలిసిన ఐదు నిమిషాలకే రాహుల్ గాంధీ కూడా జేసీని కలిశారట. రాహుల్‌ లో మాత్రం విభజన విషయంలో తప్పుచేశామన్న భావన కనిపించిందన్నారు.
Tags:    

Similar News