రాహుల్ ను రప్పిస్తున్నది అందుకోసమా?

Update: 2015-07-16 15:13 GMT
    రైతు సమస్యలపై దేశంలో పాదయాత్ర చేస్తున్న ఏఐసీసీ ఉపాద్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ఇప్పటికే పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో ఆయన ఏపీలోని అనంతపురంనూ పాదయాత్ర చేయబోతున్నారు... అయితే... ఆయన పాదయాత్రకు అనంతపురాన్ని ఎంచుకోవడంపై రకరకాల విమర్శలు వస్తున్నాయి. పదవుల్లేకుండా ఖాళీగా ఉన్న ఏపీ కాంగ్రెస్ నేతలకు సారథ్యం వహిస్తున్న మరో పదవిలేని నేత రఘువీరారెడ్డి ప్లాను మేరకే రాహుల్ అనంతపురం వస్తున్నారని సమాచారం. అయితే... ఈ ప్లాను కాంగ్రెస్ పార్టీకి పనికొచ్చే ప్లాను కాదు, రఘువీరాకు పనికొచ్చే సొంత ప్లానని అనంతపురం టీడీపీ నాయకులు అంటున్నారు. సమీప భవిష్యత్తులో ఏపీలో గెలిచి పదవులు పొందే అవకాశం లేకపోవడంతో ఆయన రాజ్యసభపై కన్నేశారని... అందులో భాగంగానే సొంత జిల్లా అనంతపురానికి రాహుల్ ను తెచ్చి కాస్త హడావుడి చేసి రాజ్యసభ సీటు కొట్టేయాలని అనుకుంటున్నారని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి ఆరోపిస్తున్నారు.

రాహుల్ గాంధీ తొలుత కాంగ్రెస్ హయాంలో జరిగిన రైతుల ఆత్మహత్యలపై సమాధానం చెప్పాలని, వారికి పరిహారం ఇవ్వాలని... ఆ తర్వాతే రైతుయాత్ర చేయాలని ఆయన డిమాండ్  చేశారు. కాగా రఘువీరాకు రాజ్యసభ ఇవ్వాలంటే ఇతర రాష్ట్రాలలో ఎక్కడైనా చూడాలి కానీ... ఏపీ నుంచి ఇవ్వడానికి ఒక్క సీటుకూ ఛాన్సు లేదు. ఈ పరిస్థితుల్లో రఘువీరా కష్టం ఏమవుతుందో చూడాలి.
Tags:    

Similar News