జేసీ బ్రదర్స్ అంటేనే రెబల్స్ కు మారు పేరు. ఎవరేం అనుకున్నా వారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. కాంగ్రెస్ లో ఉన్నా టీడీపీలో ఉన్నా జేసీ బ్రదర్స్ పంథా మాత్రం మారలేదు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ర్ట ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులందరూ కేంద్రంతో ఓ పక్క గట్టిగా ఫైటింగ్ చేస్తుంటే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా రాదంటే రాదు....వస్తుందంటే తనతో పాటు మరో 8 మంది టీడీపీ ఎంపీలను కూడా రాజీనామా చేయిస్తానని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. అన్న దివాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్టు ఎలా మాట్లాడతారో తమ్ముడు తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కూడా అదే రూట్ లో వెళుతూ అన్నకు తగ్గ తమ్ముడనిపించుకుంటున్నారు.
తాజాగా ఈ రోజు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా అంటూ నాటకాలాడుతున్న రఘువీరా తన పద్ధతి మార్చుకోవాలని లేకపోతే రఘువీరా ఇంటికెళ్లి కొడతానని ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొద్ది రోజులుగా రఘువీరారెడ్డి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని...ఇందుకు నిరసనగా తాను పీఎం మోడీతో పాటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై కేసులు పెడతానని విమర్శిస్తూ వస్తున్నారు.
రఘువీర వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన జేసీ కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిందని.... రాష్ట్రవిభజనలో ప్రజలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ నాయుకులేనని..అయితే ఇప్పుడు ప్రజల కోసం తామున్నామంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. రఘువీరా నాటకాలు కట్టిపెట్టి ..నోరు అదుపులో పెట్టుకోపోతే ఆయన ఇంటికి వెళ్లి మరీ కొడతానని కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు.