సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసి రిటైర్ అయిన లక్ష్మీనారాయణ కూడా పొలిటికల్ స్టంట్లు మొదలు పెట్టేసినట్లున్నారు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వేడిలో ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. రాబోయే ఎన్నికల్లో వైజాగ్ ఎంపీగా పోటీచేయబోతున్నారు. జనాలను ఆకట్టుకునేందుకు ఏదేదో మాట్లాడేస్తున్నారు. జనాల్లోని సెంటిమెంటును ఆధారంగా చేసుకుని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్లాన్ చేసినట్లున్నారు. అందుకనే స్టీల్ ఫ్యాక్టరీ అంశాన్ని గట్టిగా అందుకున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే స్టీల్ ఫ్యాక్టరీకి రా మెటీరియల్ సప్లై, నిర్వహణ నిధులను సమకూర్చటం లాంటి వాటిని ప్రైవేటు వ్యక్తులను అప్పగించాలని స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం అనుకున్నది. ఇందుకు బిడ్లను ఆహ్వానిస్తూ ప్రకటనచేసింది. మామూలుగా అయితే శనివారం మధ్యాహ్నం మూడుగంటలకు బిడ్లు వేయటానికి గడువు ముగిసింది. గడువులోగా 22 సంస్ధల నుండే బిడ్లు వచ్చాయి. ఇంకా కొన్ని సంస్ధలు బిడ్లు వేస్తామని చెప్పటంతో గడువును 20వ తేదీవరకు పొడిగించింది యాజమాన్యం.
ఇంతవరకు బాగానే ఉంది కానీ మధ్యలో జేడీ చేస్తున్న పనే బాగలేదు. ఎందుకంటే నిర్వహణ నిధుల కింద ఫ్యాక్టరిలో రు. 5 వేల కోట్లు పెట్టుబడి పెట్టాల్సుంటంది. అలాగే రా మెటీరియల్ గా ఫైనెస్ట్ బొగ్గును సరఫరా చేయాలి. వీటి విషయంలో జేడీ ఏమంటున్నారంటే జనాలంతా తలా 400 రూపాయలు విరాళంగా ఇస్తే చాలట ఆయన బిడ్లు దాఖలు చేస్తారట. ఇది జరిగే పనేనా ?
ఎంతమంది విరాళాలిస్తే రు. 5 వేల కోట్లయ్యేది. రా మెటీరియల్ సప్లైలో భాగంగా ఫైనెస్ట్ బొగ్గును జేడీ ఎక్కడి నుంచి తెస్తారు ? ఎలా సరఫరా చేయగలరు ? దానికి ఎన్ని వేల కోట్లు ఖర్చవుతుంది ? ఇదంతా జనాల భాగస్వామ్యంతో అయ్యేపనేనా ? ఏదో సినిమాలో చూపించినట్లుగా ఉంది జేడీ వ్యవహారం చూస్తుంటే. సినిమాల్లో చూసేది, చూపించేదంతా బయట నిజాలు కావన్న విషయం అందరికీ తెలుసు. అయినా సరే జేడీ సినిమా లెవల్లోనే మాట్లాడుతున్నారంటే కచ్చితంగా ఓవర యాక్షన్ చేస్తున్నారనే అనుకోవాలి. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే రాబోయే ఎన్నికల్లో ఓట్లకోసమే అని అర్ధమైపోతోంది.