సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఆయన విశాఖపట్నం నుంచి జనసేన పార్టీ తరఫున పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2,88,000 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.
ఆ తర్వాత జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చేసిన జేడీ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా పోరాడుతున్నారు. నిత్యం సోషల్ మీడియాలో ఈ అంశంపై ట్వీట్లు చేస్తున్నారు.
కాగా జేడీ లక్ష్మీనారాయణ కుమార్తె వివాహం హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ హాలులో జూన్ 8 రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వెంట ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులున్నారు.
కాగా సాధారణంగా కేసీఆర్ పెద్దగా శుభ, అశుభ కార్యాలకు హాజరు కారు. ఎంతో ముఖ్యమైతేనే తప్ప ఆయన రారు. కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ మాత్రమే తన తండ్రి తరఫున ఆయా కార్యక్రమాలకు హాజరవుతుంటారు. అయితే కేసీఆర్.. జేడీ లక్ష్మీనారాయణ కుమార్తె వివాహానికి హాజరు కావడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ లో బీఆర్‌ఎస్ విస్తరణపైన కేసీఆర్ దృష్టి సారించారు. ఇప్పటికే ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించారు. అలాగే మాజీ మంత్రి రావెల కిశోర్ బాబులాంటి వాళ్లను పార్టీలో చేర్చుకున్నారు. సమర్థుడైన అధికారిగా పనిచేసి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిగా పేరున్న జేడీ లక్ష్మీనారాయణను చేర్చుకోవడానికి ఇటీవల బీఆర్‌ఎస్ నేతలు పావులు కదిపారు.
ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు విశాఖపట్నం వచ్చి స్వయంగా ఒక హోటల్ లో జేడీ లక్ష్మీనారాయణను కలిసి చర్చలు జరిపారు. జేడీ కూడా బీఆర్‌ఎస్ కు అనుకూలంగానే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చేరిక ఖాయమనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు బీఆర్‌ఎస్ లో ఆయన చేరలేదు.
వాస్తవానికి తోట చంద్రశేఖర్ కు బాధ్యతలు అప్పగించకముందు జేడీ లక్ష్మీనారాయణపైనే కేసీఆర్ దృష్టి ఉందని సమాచారం. జేడీ లక్ష్మీనారాయణ కాపు సామాజికవర్గానికి చెందినవారు. ఆ సామాజికవర్గానికి ఇటీవల కేసీఆర్ పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నియామకం కూడా ఈ కోవలో జరిగిందనే వార్తలు కూడా వచ్చాయి.
అయితే జేడీ లక్ష్మీనారాయణ వెంటనే బీఆర్‌ఎస్ లో చేరడానికి మొగ్గు చూపకపోవడంతో కేసీఆర్.. మరో మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ కు ఏపీ బీఆర్‌ఎస్ పగ్గాలు అప్పగించారని టాక్.
ఇక ఇప్పుడు లక్ష్మీనారాయణ కుమార్తె వివాహానికి కేసీఆర్ హాజరు కావడంతో లక్ష్మీనారాయణ బీఆర్‌ఎస్ లో చేరికపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి.