ఆమె సినిమా నటి. చక్కగా తన అభినయాన్ని వెండి తెర మీద చూపించే సామర్ధ్యం ఆమెకు ఉంది. ఇక ఆమె చక్కని వక్త. ఏ విషయం మీద అయినా దాటీగా మాట్లాడగల నేర్పు ఉంది. ఎన్ని ఉన్నా కూడా ఆమె రాజకీయాల్లో రాణించలేకపోవడానికి నిలకడలేని తనమే అతి ముఖ్య కారణం అని అంటున్నారు. ఆమె చాలా కాలంగా రాజకీయాల మీద ఆసక్తితో ఉన్నారు. ఆమె అనేక పార్టీలను మారారు. తాజాగా ఆమె మరోసారి బీజేపీలో చేరారు. మరోసారి అంటే ఆమె ఇంతకు ముందు కూడా ఇదే బీజేపీలో చేరి ఉన్నారని అర్ధం
తాజాగా ఆమె తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ ని యాదాద్రి జిల్లాలో కలసి అక్కడ బీజేపీ కండువా కప్పుకున్నారు. తెలంగాణాలో టీయారెస్ పాలన ఏమీ బాగులేదని ఆమె దుయ్యబెట్టారు. ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు అని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణాలో బీజేపీ దూసుకుపోతోందని కూడా కితాబు ఇచ్చారు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో తాను ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలన్న కోరికను ఆమె వెలిబుచ్చారు. అయితే పార్టీ ఆదేశించాలి కానీ తాను ఎక్కడ నుంచి అయినా పోటీ చేయడానికి రెడీ అని ఆమె పేర్కొన్నారు.
మొత్తానికి జీవితారాజశేఖర్ లో రాజకీయ ఆకాంక్షలు బలంగా ఉన్నాయి. అయితే ముందే చెప్పుకున్నట్లుగా రాజకీయంగా నిలకడలేనితనమే ఆమెకు ఇబ్బందిగా మారింది అనే వారూ ఉన్నారు. జీవితా రాజశేఖర్ రాజకీయ జీవితాన్ని ఒకసారి చూస్తే మొదట కాంగ్రెస్ లో చేరారు జీవితా రాజశేఖర్ చేరారు. ఆ తరువాత టీడీపీ, జగన్ నాయకత్వాన వైసీపీ, ఆ మీదట బీజేపీ, మళ్లీ 2019 ఎన్నికల వేళ జగన్ని లోటస్ పాండ్ లో కలసి వైసీపీలో చేరారు. మళ్లీ కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండి ఇపుడు బీజేపీ. ఇలా సాగుతోంది జీవితా రాజశేఖర్ రాజకీయ పార్టీల మార్పు.
నిజంగా ఫక్తు రాజకీయ నాయకుడు కూడా ఇన్ని పార్టీలు మారి ఉండరేమో. ఇక్కడ ముచ్చట ఏంటి అంటే జీవిత రాజశేఖర్ ఒక పార్టీలో చేరి అక్కడ గట్టిగా పనిచేస్తున్నారా అన్నది కూడా విమర్శలు ఉన్నాయి. పదవులు రావాలీ అంటే ఎవరైనా పనిచేయాలి. అది సెలిబ్రిటీలకూ వర్తిస్తుంది. తాము సినీ గ్లామర్ తో ఉన్నాం కాబట్టి వచ్చిన వెంటనే పదవులు అంటే ఎవరూ ఇవ్వలేరు. పార్టీ సిద్ధాంతాలను అర్ధం చేసుకుని పనిచేస్తేనే గుర్తింపు ఉంటుంది.
రెండు సార్లు జగన్ పార్టీలో చేరి పక్కకు పోవడానికి కారణాలు ఏంటో ఎవరికీ తెలియదు. చంద్రబాబుని దార్శనీకుడు అని పొగిడి ఆ తరువాత ఎందుకు ఆ పార్టీలో లేరు అన్న దానికి జవాబు లేదు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీలు మరి అక్కడ ఎందుకు ఇమడలేకపోయారో కూడా జవాబు లేదు. ఇపుడు మళ్లీ బీజేపీ అంటున్న జీవిత అక్కడ ఎన్నాళ్ళు ఉంటారు అన్న సందేహాలు ఎవరికైనా వస్తున్నాయీ అంటే ఆమె రాజెకీయం అలా ఉందనే అనుకోవాలంటున్నారు.
ఇక బీజేపీ వారు సైతం వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకుని కండువా కప్పేస్తున్నారు. జీవితతో పాటు జయసుధ తదితర సినీ నటులకు వారు గేలం వేశారు. సినిమా వారు చేరితే వారిని ప్రచారానికి ఉపయోగించుకుని వదిలేయడం కూడా పార్టీలు చేస్తున్న తప్పుగా ఉంటోంది. వారిలో నిజంగా ప్రజా సేవ చేయాలన్న ఆసక్తి ఉంటే అవకాశాలు ఇవాలి. అయితే ఇపుడున్న రాజకీయాల్లో చిత్తశుద్ధితో పనిచేసే వారికి అవకాశాలు రావడంలేదు. ఏది ఏమైనా జీవితా రాజశేఖర్ మాత్రం పార్టీలను మార్చడంతో సినీ రంగంలో చూసుకుంటే రికార్డులు బద్ధలు కొట్టారనే సెటైర్లు పడుతున్నాయి.