జెట్ ఎయిర్ లైన్స్ పైలెట్ ఎంత పని చేశాడంటే..

Update: 2017-02-20 07:22 GMT
బస్సు కావొచ్చు.. రైలు కావొచ్చు.. ఫ్లైట్ కావొచ్చు. ఎక్కి కూర్చున్నాక.. మనకు ఏ మాత్రం పరిచయం లేకున్నా.. వృత్తి పట్ల వారికుండే కమిట్ మెంట్ విషయంపైన ఉండే నమ్మకంతో గుండెల మీద చేయి వేసుకొని ధీమాగా ఉంటాం. కానీ.. జెట్ఎయిర్ లైన్స్ పైలెట్ నిర్లక్ష్యం గురించి వింటే గుండెలు జారి పోవటమేకాదు.. విమానం ఎక్కాలంటే వణికిపోయే పరిస్థితి. తాజాగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలో జర్మన్ వాయుసేన సకాలంలో స్పందించి సాయం చేయకుంటే వందలాది మంది మనోళ్లు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.

వింటేనే వణుకు పుట్టించే ఈ ఉదంతంలోకి వెళితే.. ముంబయి నుంచి లండన్ కు జెట్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 777 – 300 9డబ్ల్యూ 118 విమానం జర్మనీ గగనతలంలోకి వెళ్లింది. ఈ విమానంలో 330 మంది ప్రయాణికులు.. 15 మంది సిబ్బంది ఉన్నారు. ఈ విమానంలో భారతీయులే ఎక్కువగా చెబుతున్నారు. వెళ్లాల్సిన రూట్ లో కాకుండా.. తాను ప్రయాణించాల్సిన ప్రీక్వెన్సీలో కాకుండా వేరే ఫ్రీక్వెన్సీలోకి విమానాన్ని తీసుకెళ్లటంతో ఒక్కసారిగా ఏటీసీతో సంబంధాలు కట్ అయ్యాయి.

ఎక్కడికి వెళుతున్నామో.. ఎటు వెళుతున్నామో దిక్కు తోచని పరిస్థితి. విషయాన్ని అర్థం చేసుకున్న జర్మనీ వాయుసేనకు చెందిన జెట్ ఫైటర్లు వెనువెంటనే రంగంలోకి దిగాయి. దారి తప్పిన జెట్ విమానానికి తోడుగా వెళ్లిన విమానాలు.. తాము విడిచే పొగతో సరైన దారిలోకి విమానాన్ని తీసుకొచ్చాయి. దీంతో.. విమానంలోని 330 మంది ప్రయాణికులు.. సిబ్బంది క్షేమంగా నేలమీద అడుగు పెట్టారు.ఈ విషయాన్ని జెట్ ఎయిర్ లైన్స్ ఆచితూచి రియాక్ట్ అయ్యిందే తప్పించి.. అసలు విషయాన్ని చెప్పలేదు. నిర్లక్ష్యంతో వ్యవహరించిన పైలెట్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నది వెల్లడించకపోవటం గమనార్హం.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News