తమ్ముడి స్థానంలో 12 ఏళ్లుగా అన్న ఉద్యోగం....ఎలా బయటపడిందంటే !

Update: 2020-08-29 10:10 GMT
వారిద్దరు కవల పిల్లలు , చూడటానికి అచ్చం ఒకేలా ఉంటారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏకంగా 12 ఏళ్లుగా అన్న ఉద్యోగాన్ని తమ్ముడు చేస్తున్నాడు. చివరకు ఈ విషయాన్ని స్వయంగా అన్న ఫిర్యాదు చేసే వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. అన్న ఫిర్యాదు మేరకు .. చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సినిమా స్టోరీని తలపించేలా ఉన్న ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వెలుగులోకి వచ్చింది

పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని చంద్రశేఖర్ నగర్ కు చెందిన గాదె రవీందర్. గాదె రాందాస్ అన్నదమ్ములు. పన్నెండేళ్ల క్రితం మంధని సబ్ స్టేషన్ లో తాత్కాలిక ఉద్యోగిగా పని చేసిన రవీందర్ శాశ్వత ఉద్యోగం కోసం తమ్ముడు రాందాస్ కు చెందిన ఐటీఐ సర్టిఫికెట్ లు ఉపయోగించుకున్నాడు. అదే పేరుతో ఉద్యోగం చేస్తూ ప్రమోషన్లు కూడా పొందాడు. ప్రస్తుతం గోదావరిఖని తూర్పు డివిజన్ లో లైన్ మెన్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో సోదరుల మధ్య ఆస్తి గొడవలు మొదలయ్యింది. ఈ క్రమంలో తమ్ముడు రాందాస్….. తన సర్టిఫికెట్లతో అన్న ఉద్యోగం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ కేసును పట్టించుకోకపోవటంతో సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించాడు. వాటిని ఎన్సీడీసీఎల్ విజిలెన్స్ విభాగానికి అందచేశాడు. విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి రవీందర్ చేసిన మోసాన్నిగుర్తించి రవీందర్ ను సస్పెండ్ చేశారు. దీనిపై విచారణ చేస్తున్నారు.
Tags:    

Similar News