ఏపీలో పంచాయితీ ఎన్నికలు చిచ్చు పెడుతున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఏపీలో కీలక పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించలేమని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎక్కగా.. ఉద్యోగులు సైతం జగన్ దారిలో నడుస్తున్నారు.
తాజాగా రేపు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీకి సిద్ధమవుతుండగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ సీఎస్ ఆధిత్యనాథ్ దాస్ తో ఉద్యోగ సంఘాల ఐకాస భేటి అయ్యింది. ఎన్నికల విధుల్లో పాల్గొనలేమంటూ ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ కు వినతిపత్రం అందజేశారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పాల్గొనలేమని వినతిపత్రంలో పేర్కొన్నారు.
రెవెన్యూ, పోలీస్, పంచాయితీరాజ్, ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఇతర అనుబంధ సంఘాల నేతలు సీఎస్ ను కలిసి 9 పేజీల వినతిపత్రాన్ని తాజాగా అందజేశారు.
టీకాల ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని.. అప్పటివరకు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ విధుల్లో పాల్గొంటున్నామని.. కేవలం టీకాల ప్రక్రియ పూర్తయ్యే వరకు మాత్రమే ఎన్నికల వాయిదా కోరుతున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు.