సహజంగా భూమ్మీద ఉన్నట్టే.. రాజకీయాల్లోనూ ‘‘వాతావరణం’’ అనేది ఒకటి ఉంటుంది. ఒక్కో పార్టీకి ఒక్కోసారి ఆ వాతావరణం అనుకూలంగా మారుతూ కనిపిస్తుంటుంది. అది ఎన్నికల వరకు కొనసాగితే.. ఆయా పార్టీల అధినేతలు, కీలక నేతలు దానినికొనసాగించగలిగితే.. ఆ ఎన్నికల్లో వారికే విజయం దక్కుతుంది. మధ్యలో ప్రత్యర్థులు లేదా అధికార పార్టీ వారు వేసే బలమైన ఎత్తులను అంతే బలంగా చిత్తు చేస్తూ వెళ్తేనే ఇది సాధ్యం.
ఉదాహరణకు 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. అటువైపు కాంగ్రెస్, టీటీడీపీ ఇతర పార్టీలతో మహా కూటమి కట్టినా బెదరలేదు. సరికదా..? అవకాశాన్ని మరో విధంగా అందిపుచ్చుకున్నారు. మళ్లీ ఉమ్మడి ఏపీ నాటి పాలన వస్తుందంటూ ప్రజలను చైతన్యం చేసి ఓట్లు కొల్లగొట్టారు. తెలంగాణ వచ్చిన ఏడాది 2014లో జరిగిన ఎన్నకల్లో కంటే.. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధించి ఔరా అనిపించారు.
ఇక 2019 ఎన్నికలకు ముందు ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి పరిస్థితి మార్చివేశారు. ఆ పాదయాత్రను 2017లో మొదలుపెట్టి 2019 వరకు విజయవంతంగా కొనసాగించారు. ఫలితంగా, ప్రజల్లో అద్భుతమైన స్పందన వచ్చింది. జగన్ ను పరిపూర్ణ నాయకుడిగా నిలబెట్టింది. ఇదే సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ చేసిన పనులు కొన్నింటిని చెప్పుకోలేకపోయింది. దీనికితో్డు కేంద్ర ప్రభుత్వంతో సమరానికి దిగి అనూహ్యంగా దెబ్బతిన్నది. అప్పటికీ, ఎన్నికల ముందువరకు టీడీపీ - వైసీపీ మధ్య హోరాహోరీ సమరం ఉంటుందని భావించారు. కానీ, వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంది.
మిగిలింది రెండేళ్లు..
సరిగ్గా చెప్పాలంటే ఏపీలో ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి మాత్రమే ఉంది. ముందస్తుకు వెళ్తే ఈ వ్యవధి ఇంకా తగ్గే అవకాశం ఉంది. కాగా, ఇప్పటి పరిస్థితులను చూస్తుంటే వైసీపీ కొంత సంకట స్థితినే ఎదుర్కొంటోందని చెప్నాలి.
సరిగ్గా ఆ పార్టీ అధికార కాలం నుంచే ప్రారంభమైన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పుడు కీలక మలుపునకు వచ్చింది. వివేకా.. సీఎం జగన్ కు సొంత బాబాయి. ఈ హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్నది జగన్ అత్యంత సమీప బంధువులు. అందులోనూ ఓ ప్రజాప్రతినిధి, ఆయన తండ్రి కూడా ఉన్నారు. అయితే, ఇవన్నీ ఆరోపణలే. వాస్తవాలేంటో తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సి ఉంటుంది. ఆ వేచి ఉండాల్సిన కాలం ఎన్నికల వరకు కొనసాగి.. ఫలితం పొరపాటున గనుక వ్యతిరేకంగా వస్తే వైసీపికి దిక్కుతోచకపోవచ్చు.
మరోవైపు వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకు మొదలుపెట్టిన రాజధాని రాజకీయం ఎదురుతన్నింది. అమరావతి ఏకైక రాజధానికి బదులు అమరావతితో పాటు విశాఖపట్నం, కర్పూలు లను రాజధానులు చేస్తామని జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. నాటి ముహూర్తం ఏమోగానీ.. ఈ ప్రకటనకు తొలినాళ్లలో అద్భుత స్పందన వచ్చింది. పైగా అందరూ ఇష్టపడే విశాఖను రాజధాని చేస్తామనడం సంతోషపెట్టింది.
అయితే, ఇదంతా ఓ భావోద్వేగ అంశంగా మారిపోయింది. మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకించిన తటస్థులు సైతం విమర్శలకు గురయ్యారు. ఉత్తరాంధ్రకు రాజధాని వద్దా? అంటూ సమీప ప్రాంతాల వారి నుంచి వారికి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక ఓ దుర్మూహూర్తంలో కరోనా ప్రవేశించి కల్లోలం రేపింది. సరిగ్గా రెండేళ్ల నుంచి మూడు రాజధానుల అడుగు ముందుకుపడలేదు. కాగా, ఇటీవల హైకోర్టు తీర్పు ఓ పెద్ద మైనస్ అయింది. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లలును ఉపసంహరించుకున్న వైసీపీ సర్కారు ఇకపై ఏంచేయబోతోందో చూడాలి.
జోరు పెంచిన టీడీపీ వైసీపీ చేతిలో అసెంబ్లీ ఎన్నికల నుంచి చావుదెబ్బతిని.. ఆ తర్వాత రాజకీయంగానూ గ్రాఫ్ పడిపోయిన టీడీపీకి ఏమిచేయాలో పాలుపోని స్థితి నుంచి ప్రస్తుతం కొంత ఊపిరి వచ్చింది. వాస్తవానికి జగన్ దెబ్బలకు టీడీపీ ఠారెత్తిపోయింది. పూర్తిగా తమ వారు అనుకున్న ఎమ్మెల్యేలనూ వైసీసీ లాక్కుంటుండడంతో టీడీపీ ఏమీచేయలేకపోయింది.
దీనికితోడు ఓ మంత్రి దూషణల దాడితో కుదేలైపోయింది. ఇక సంక్షేమం విషయంలో వైసీపీ సర్కారును ప్రశ్నించే అవకాశమే లేకపోవడంతో టీడీపీ అధినేత సైతం చేతులు కట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది.
నేరుగా ఆయననే వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడంతో ఓ దశలో చంద్రబాబు రోదించాల్సి వచ్చంది. ఇలాంటి అవమానాలు, అవహేళనల స్థితిని దాటుకుని టీడీపీ నిలదొక్కుకుంది.
ఇక సమరమే..
వివేకా హత్య కేసులో వైసీపీ నేతలు ఏమి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉండడం, రాజధానిపై కోర్టు తీర్పునకు తోడు పాలనాపరమైన వైఫల్యాలు కొన్ని వైసీపీ సర్కారును వెనుకపడేశాయి.
అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని మార్చలేకపోయింది. ఇప్పటికీ సంక్షేమ మంత్రాన్నే జపిస్తూ ప్రగతి గురించి చెప్పలేకపోతోంది. మూడేళ్లలో ఫలానా అభివ`ద్ది కార్యక్రమం చేశాం అని చెప్పుకోలేని స్థితిలో ఉంది వైసీపీ. కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారంటేనే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు.
ఇదే సమయంలో రాజకీయ పరిణామాలు వారికి వ్యతిరేకంగా మారుతున్నాయి. దీనిని టీడీపీ అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఉంది. ఉదాహరణకు.. వివేకా హత్య కేసుపై ఇప్పటివరకు టీడీపీ కీలక నేతలే మాట్లాడుతుండగా.. ఇప్పుడు అందరూ గళం విప్పుతున్నారు. చంద్రబాబు అయితే ఏకంగా సెటైర్లు వేసేస్తూ.. సూటిగా నిలదీస్తున్నారు.
రాజధాని అమరావతి ఎలాగూ టీడీపీ వారి మానసపుత్రిక. తాజా కోర్టు తీర్పుతో వారికి మనోబలం వచ్చినట్లయింది. దీనికితోడు ప్రజా సమస్యలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. వీటి మధ్యలో చంద్రబాబు నాయకత్వం, గతంలో చేసిన పనులను చూపుకొనే అవకాశం ఎలాగూ ఉండనే ఉంది.
నాయకులపై వేధింపు బూమరాంగే? వైసీపీ ఏంచేయాలి మరి?
పట్టాభి, బోండా ఉమా, దేవినేని ఉమా, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు.. ఇలా వైసీపీ వ్యక్తిగతంగా ఎందరో టీడీపీ నాయకులను టార్గెట్ చేసింది. ఇది ఎంత సర్దిచెప్పుకొన్నా.. కక్ష రాజకీయాలుగానే ప్రజలు భావిస్తారు.
ఇప్పుడివన్నీ సమీక్షిస్తే ప్రతికూలతలుగా మారే ప్రమాదం ఉంది. ఇక వ్యవస్థల మీద వైసీపీ దాడి ఏ విధంగా సాగిందో అందరూ చూశారు. అయితే, ఇలాంటి అన్నిటినీ వైఎస్ జగన్ నాయకత్వ పటిమ, సంక్షేమ మంత్రం మరిపిస్తూ వచ్చాయి. ఎన్నికల ముందు మాత్రం ఇవి ఓ భాగంగానే మారిపోతాయి తప్ప.. ప్రధాన అంశంగా నిలిచేందుకు, చూపేందుకు పనికిరావు.
వీటిని అధిగమించాలంటే వైసీపీ సమీక్షకు దిగడం ఉత్తమం. కొత్త జిల్లాల ఏర్పాటు, మంత్రివర్గ మార్పులతో పరిపాలనా సంస్కరణలను పరుగులు పెట్టిస్తే వైసీపీ పరిస్థితి ఆశావహంగా మారొచ్చు. కాగా, వైసీపీకి మరో గండం వైఎస్ షర్మిల రూపంలో పొంచి ఉంది. ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఏపీలో పర్యటిస్తూ క్రైస్తవులను కలుస్తుండడం ఎంతైనా ఆందోళన కారకమే. దీనికి ఎంత త్వరగా అడ్డుకట్ట వేస్తే అంత మంచిది.