ఏపీకి ప్రత్యేక హోదా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ ఉద్యమం ప్రజలు ప్రాణాలను త్యాగం చేసే దిశగా వెళుతోంది. కొద్ది రోజుల క్రితం తిరుపతిలో కాంగ్రెస్ కార్యకర్త మునికోటి ఆత్యహత్య చేసుకున్న సంగతి మరువక ముందే తాజాగా శనివారం కృష్ణా జిల్లా పామర్రులో మాజీ విలేకరి సుబ్బారావు ఏపీకి వెంటనే స్పెషల్ స్టేటస్ కావాలంటూ ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
వెంటనే అది గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆయన్ను విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు విజయవాడలో పార్టీ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు సమావేశం ముగిసిన వెంటనే హైదరాబాద్‌కు బయలు దేరుతుండగా ఆయనకు ఈ విషయం తెలిసింది. వెంటనే చంద్రబాబు హుటాహుటీన ఆసుపత్రికి వెళ్లి సుబ్బారావును పరామర్శించారు. సుబ్బారావుకు మెరుగైన చికిత్సనందించాలని అధికారులను, ఆసుపత్రి వర్గాలను సీఎం ఆదేశించారు.
సుబ్బారావు వైద్యానికి అయ్యే ఖర్చులను మొత్తం ప్రభుత్వం భరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా విషయమై తాను ఈ నెల 25న మోడీని కలుస్తున్నానని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..ఇలాంటి అఘాయత్యాలకు పాల్పడవద్దని ఆయన సూచించారు. ఇదిలా ఉంటే సుబ్బరావు ఏపీకి ప్రత్యేక హోదా కోసమే ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు పోలీసులు కూడా ధృవీకరించారు.