ఆ మాజీ జడ్జి మరణం వెనుక మిస్టరీ ఉందా?

Update: 2016-01-18 09:21 GMT
మాజీ జడ్జి ప్రభాకరరావు ఆత్మహత్య చేసుకున్న సమాచారం కలకలం రేపుతోంది.  ఆయన గతంలో కర్ణాటక మాజీ మంత్రి - మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి బెయిల్ కుంభకోణం కేసులో నిందితుడుగా ఉన్నారు. జనార్దనరెడ్డి నుంచి డబ్బు తీసుకుని ఆయన కు బెయిల్ రావడానికి ఈయన ప్రయత్నించారని అప్పట్లో ఆరోపణలు రాగా,సిబిఐ ఈయనను కూడా అరెస్టు చేశారు. మరి కారణం ఏమిటో తెలియదు కాని ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

మైనింగ్‌ కేసులో గాలి జనార్దన్‌ రెడ్డికి లంచం తీసుకుని బెయిల్‌ మంజూరు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ  మాజీ న్యాయమూర్తి ప్రభాకరరావు మృతిచెందారు. బెయిల్‌ స్కామ్‌ లో సస్పెండ్‌ అయిన ప్రభాకర్‌ రావు ఇటీవలే బెయిల్‌ పై బయటకు వచ్చారు. తొలుత ఆత్మహత్య చేసుకున్నట్టు అందరూ భావించారు. అయితే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ ఈస్టుమారేడ్‌ పల్లిలోని నివాసంలో ఆయన మృతి చెందారు. తనను కేసులో అన్యాయంగా ఇరికించారని దీనిపై  ప్రభాకర్‌ రావు న్యాయ పోరాటం చేస్తున్నారు.

అయితే న్యాయమూర్తిగా ఉంటూ అరెస్టు కావడంతో అప్పట్లో ఆయన మానసికంగా కుంగిపోయారు. ఇటీవల బెయిలు వచ్చిన తరువాత న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. కానీ , అంతలోనే ఆయన చనిపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన చనిపోవడం వెనుక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబసభ్యులు మాత్రం గుండెపోటుతో చనిపోయినట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News