అమెరికాలో ముస్లిం జ‌డ్జీ హ‌త్య‌!

Update: 2017-04-13 14:42 GMT
అగ్ర‌రాజ్యం అమెరికాలో మరో దారుణం జరిగింది. ఇన్నాళ్లు సామాన్యుల ప్రాణాల‌కే విలువ లేని ప‌రిస్థితి ఉండ‌గా...ఈ జాబితాలోకి ఉన్న‌త స్థానాల్లో ఉన్న‌వారు సైతం చేరిపోయిన‌ట్లు క‌నిపిస్తోంది. అమెరికాలోనే తొలి ముస్లిం మహిళా న్యాయమూర్తిగా ఎన్నికై రికార్డు సృష్టించిన షీలా అబ్దుస్ సలామ్ (65) అనుమానాస్ప‌ద రీతిలో మ‌ర‌ణించారు. హడ్సన్ నదిలో విగత జీవిగా కనిపించడం కలకలం రేపింది. షీలా అబ్దుల్‌ సలామ్ ప్ర‌స్తుతం న్యూయార్క్ స్టేట్ అత్యున్నత న్యాయస్థానంలో అసోసియేట్ జడ్జిగా ఉన్నారు.

హ‌డ్స‌న్ నదిలో ఎవరిదో మృతదేహం తేలియాడుతోందని వచ్చిన సమాచారంపై స్పందించిన న్యూయార్క్ పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, ఆమె అబ్దుల్‌ సలామ్ అని గుర్తించారు. ఆమెపై దాడి జరిగిన ఆనవాళ్లు లేవని, ధరించిన బట్టలు కూడా చిరగలేదని వెల్లడించిన పోలీసులు, విచారణ జరుపుతున్నామని అన్నారు. కాగా, షీలా అబ్దుల్ స‌లామ్ హర్లీమ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. 2013 నుంచి న్యాయమూర్తిగా ఉన్న ఆమె, అంతకుముందు 15 సంవత్సరాలు మన్ హటన్ కోర్టులో ఫస్ట్ అపిలేట్ డివిజన్ లో సేవలందించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News