ఏపీలో.. పని ప్రారంభించిన జుడిషియల్ ప్రివ్యూ.

Update: 2019-10-18 15:49 GMT
పారదర్శక పాలన లక్ష్యంగా వంద కోట్ల రూపాయలు దాటిన ఏ  వ్యవహారాన్ని అయినా జ్యూడీషియల్ ప్రివ్యూకు పంపిస్తామని ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

ఇంత వరకూ దేశంలో ఎక్కడా లేని రీతిలో జగన్ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలో రాజకీయ నేతలు ఎక్కువగా దోచుకునేది అలాంటి టెండర్ వ్యవహారాల్లోనే అనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో వంద కోట్ల రూపాయల పై స్థాయి వ్యవహారం ఏదైనా జ్యూడీషియల్ ప్రివ్యూకు వెళ్తుందని, ముందుగానే ఆ విషయంలో విచారణ జరుగుతుందని జగన్ ప్రకటించారు ఆ మేరకు ఇప్పుడు జ్యూడీషియల్ విచారణ మొదలైంది.

ఈ నేఫథ్యంలో ప్రివ్యూకు తొలి టెండర్ వెళ్లింది.  108 - 104 అంబులెన్సుల నిర్వాహాణ విషయంలో సర్వీస్ ప్రొవైడర్ కోసం టెండర్లు ఆహ్వానించనుంది సర్కార్. 108, 104 అంబులెన్సుల సర్వీస్ ప్రొవైడర్ టెండరును జుడిషియల్ ప్రివ్యూకు పంపింది జగన్ సర్కార్.ఈ మేరకు వైద్యారోగ్య శాఖను వివరాలను కోరింది జుడిషియల్ ప్రివ్యూ. ఒక్కో అంబులెన్స్  నిర్వాహణకు నెలకు సుమారు రూ. 1.35 లక్షలు అవుతుందని అంచనా.

ప్రస్తుతం అందుబాటులో 600కు పైగా అంబులెన్సులు న్నాయి. 700కు అంబులెన్సులను సిద్దం చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. అంబులెన్స్ నిర్వాహాణ అంచనా వ్యయం రూ. 100 కోట్లు దాటుతుండడంతో జుడిషియల్ ప్రివ్యూకు పంపింది. ఇలా ఏపీలో సంచలనాత్మక రీతిలో జ్యూడీషియల్ ప్రివ్యూ ప్రక్రియ మొదలైంది.
Tags:    

Similar News